పేదల కోసం కేటాయించిన ఎన్‌టిఆర్ గృహాలపై సిమెంటు భారం పడుతోంది. అమాంతం పెరిగిన గృహనిర్మాణ వస్తువుల ధరలతో వారు బెంభేలెత్తిపోతున్నారు. రలను పెంచటం ద్వారా ఉత్పత్తి దారులు లాభాలను మూటగట్టుకోవడం లేదు. మేం కేవలం నష్టాలను తగ్గించుకుంటున్నాం. సిమెంట్ తయారీలో స్థిర వ్యయాలు, చలన వ్యయాలు అని రెండు రకాలు. స్థిర వ్యయాలను అదుపు చేయలేం. అవి ఏ సంస్థ అయినా తప్పక భరించాలి. ఇక చలన వ్యయాల్లో ఏవీ మా చేతుల్లో లేవు. ఉదాహరణకు విద్యుత్, బొగ్గు, డీజల్, రవాణా చార్జీలు...ఇవన్నీ గత ఏడాది కాలంగా బాగా పెరిగాయి. డీజల్ ధర నెలనెలకూ పెరుగుతూనే ఉంది.ఒక టన్ను సిమెంట్ ఉత్పత్తి చేయాలంటే తయారీదారు రూ. 3,655 వెచ్చించాల్సి వస్తోంది. దీనికి అదనంగా రవాణా, ఎక్సైజ్ డ్యూటీ, విలువ ఆధార పన్నులు రూ. 3,050లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. దీంతో టన్ను సిమెంట్ ఉత్పత్తి చేయాలంటే రూ. 6,705లు వ్యయం అవుతోంది. అంటే సగటున 50 కిలోల బస్తా వెల రూ. 335 అవుతోంది. ఇది కేవలం లాభనష్టాల్లేని బ్రేక్ ఈవెన్ ధర. పూర్తిగా యంత్ర ఆధారిత పరిశ్రమ కావడంతో సామర్థ్య వినియోగం అభిలషణీయ స్థాయిలో లేకపోతే తరుగుదల, వడ్డీ, అడ్మినిస్ట్రేటివ్, మార్కెటింగ్ వ్యయాలు పరిమిత ఉత్పత్తిపై మరింత భారం మోపుతున్నాయి. రవాణా, ఇంధన వ్యయాలు గత రెండేళ్లలోనే 60-70 శాతం పెరిగాయి. ఒక్కో బస్తాపై ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ రూ. 40, విలువ ఆధారిత పన్ను రూ. 45 ఆదాయం అందుతోంది. ఇది బస్తా వ్యయంలో 28 శాతానికి సమానం.ప్రభుత్వమిస్తున్న అరకొర డబ్బులతో వారి గృహాలు ముందుకు సాగడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైంది. ఎక్కడ చూసినా పునాధులకే పరిమితమైన నిర్మాణాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా యూనిట్ కాస్ట్‌ను కూడా పెంచాలని వారు డిమాండు చేస్తున్నారు.ఇటీవల సిమెంటు తయారీ కంపెనీలన్నీ రింగైపోయాయి. దీంతో సిమెంటు బస్తాపై ఒక్కో కంపెనీ 120 నుంచి 150 రూపాయల వరకు పెంచేశాయి. వీటితో పాటు నిర్మాణానికి ఉపయోగించే ఇనుము, ఇటుకల ధరలు కూడా పెరిగిపోయాయి. గృహాలు మంజూరయ్యి ఎంతో ఆశగా ఎన్‌టిఆర్ గృహాలకు పునాదులు వేసుకున్న లబ్దిదారులకు పెరిగిన ధరలు నిద్రపట్టనివ్వడం లేదు. ఒకే సారి పెరిగిపోవడంతో వారి ఆశలు అడియాశలుగా మారిపోతున్నాయి