YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాదాభివందనాలతో ఓట్లు రాలేవు రేవంత్ పై  కోమటిరెడ్డి విసుర్లు

పాదాభివందనాలతో ఓట్లు రాలేవు రేవంత్ పై  కోమటిరెడ్డి విసుర్లు

పాదాభివందనాలతో ఓట్లు రాలేవు
రేవంత్ పై  కోమటిరెడ్డి విసుర్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 3,
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సొంతపార్టీలోనే చుక్కెదురవుతోంది. అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌ని తీసి పక్కన పడేసినంత పనిచేశారు. ఈసారి రేవంత్‌తో సన్నిహితంగా ఉంటున్న సీతక్కకి సైతం సెగ తగిలింది. అటు రేవంత్.. ఇటు సీతక్క పేరెత్తకుండానే పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు కోమటిరెడ్డి. హైదరాబాద్ నోవోటెల్‌లో జరిగిన వైఎస్ సంస్మరణ సభ అందుకు వేదికైంది. వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన సభకు వెళ్లొద్దంటూ పీసీసీ ఆదేశాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.విజయమ్మ తనకి మూడు రోజుల కిందటే ఫోన్ చేసి సభకి వచ్చి మీ అన్న గురించి రెండు మాటలు చెప్పమంటే వస్తానని మాటిచ్చానని కోమటిరెడ్డి తెలిపారు. అన్ని పార్టీల వాళ్లు, వ్యాపారవేత్తలు, మేధావులు అందరూ వచ్చారని.. సభ వెనక ఎలాంటి రాజకీయ రహస్య ఎజెండా ఏం లేదని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన తయారు చేసిన వారేనని.. అలాంటాయన భార్య ఫోన్ చేసి రమ్మంటే వెళ్లకపోతే మానవత్వం ఉన్న మనుషులం అనిపించుకోమని కోమటిరెడ్డి అన్నారు.వైఎస్ సంస్మరణ సభకి వెళ్లొద్దంటూ పీసీసీ ఆదేశాలివ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మూడు రోజుల ముందు సభ ఖరారైతే.. కేవలం రెండు గంటల ముందు ఆదేశాలివ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. టీపీసీసీ నిర్ణయం పెద్ద తప్పని.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయిన వ్యక్తి సంస్మరణ సభకి వెళ్లొద్దనడం సరికాదన్నారు. అది వైఎస్‌ని అవమానించడమే అవుతుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తామేమీ జగన్, షర్మిల పార్టీ మీటింగ్‌లకి వెళ్లలేదన్నారు.రేవంత్ రెడ్డి లెవెల్‌లో తాను మాట్లాడనంటూనే రెండు గంటల ముందు ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టారు. ఇదేమైనా డిక్టేటర్‌షిప్పా అని కోమటిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొంతం కాదని స్పష్టం చేశారు. సీతక్కపై కూడా పరోక్ష విమర్శలు చేశారు కోమటిరెడ్డి. టీడీపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాదాభివందనాలు చేస్తున్నారని.. వాళ్లకి పాదాభివందనాలు చేస్తే కాంగ్రెస్‌కి ఓట్లు పడవంటూ ఘాటు విమర్శలు చేశారు.అమెరికాలో ఒబామా కేర్ పెట్టకముందే రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పెట్టారని.. ఫీజు రీఇంబర్స్‌మెంట్, ముస్లింల రిజర్వేషన్ ఇచ్చిన వైఎస్‌ని పార్టీ ఓన్ చేసుకోవాలని కోమటిరెడ్డి అన్నారు. వైఎస్ సంస్మణ సభ విషయంలో టీపీసీసీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి నిర్ణయాలు పార్టీకి నష్టం చేస్తాయని.. ఈ విషయంపై ఢిల్లీలో కూడా మాట్లాడతానని ఆయన చెప్పారు.
టీడీపీ నేతలకు పాదాభివందనాలు చేస్తే కాంగ్రెస్‌కి ఓట్లు రావంటూ కోమటిరెడ్డి గట్టిగా చెప్పారు

Related Posts