YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఎఫ్ క్లబ్ కేరాఫ్ కెల్విన్ అడ్డా

ఎఫ్ క్లబ్ కేరాఫ్ కెల్విన్ అడ్డా

ఎఫ్ క్లబ్ కేరాఫ్ కెల్విన్ అడ్డా
హైదరాబాద్, సెప్టెంబర్ 3,
ఎఫ్‌ క్లబ్‌ .. ఇప్పుడు ఇదే కెల్విన్‌ అడ్డా.. అని తేలిపోయింది. దీంతో ఎఫ్‌ క్లబ్‌ పార్టీ టాలీవుడ్‌లో ఇంకా ఎంత మంది మెడకు చుట్టుకుంటుందోననే ఉత్కంఠ మొదలైంది. ఎఫ్‌ క్లబ్‌.. డార్క్‌ వెబ్‌.. కెల్విన్‌.. నవదీప్‌.. ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈ పేర్లు ఇప్పుడు కీలకంగా మారాయి. కెల్విన్‌ విచారణలోనే కీలక విషయాలు బయట పడ్డాయి. డార్క్‌వెబ్‌ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేసి, హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు పంపించినట్టు కెల్విన్‌ విచారణలో బయటపడింది. ఇప్పుడు రకుల్‌ విచారణలో కూడా వీటన్నింటిపై ప్రశ్నలు సంధిస్తున్నారు ఈడీ అధికారులు.  2016లో నవదీప్‌ ఎఫ్‌ క్లబ్‌ పార్టీకి ఎవరెవరొచ్చారు ? కెల్విన్‌ ఎంత మందికి డ్రగ్స్‌ సరఫరా చేశాడు ? ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌తో మీకు ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటి ? ఎప్ క్లబ్‌ మేనేజర్‌కు ఎందుకు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేశారు? ఇప్పుడు ఇవే క్వొశ్చన్స్‌ రకుల్‌కు సంధిస్తున్నారు ఈడీ అధికారులు. రకుల్‌ బ్యాంక్‌ అకౌంట్ల ట్రాన్జాక్షన్స్‌ని కూడా పరిశీలించారు.సరిగ్గా ఐదేళ్ల కిందట జరిగిన ఎఫ్‌ క్లబ్‌ పార్టీపై ఫోకస్‌ పెట్టారు ఈడీ అధికారులు. ఎఫ్‌ క్లబ్‌ పార్టీకి అటెండ్‌ కావడం ఇప్పుడు రకుల్‌ప్రీత్‌సింగ్‌ మెడకు చుట్టుకుంది. 2016లో జరిగిన ఎఫ్‌ క్లబ్‌ పార్టీకి రకుల్ వెళ్లింది‌. అదే పార్టీలో చాలా మందికి డ్రగ్స్‌ సరఫరా చేశాడు కెల్విన్‌. ఎఫ్ క్లబ్‌ పార్టీ ఫుటేజ్‌ ఆధారంగా రకుల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్‌ మేనేజర్‌ కాల్ లిస్ట్‌లో రకుల్‌ పేరు ఉండటంతో ఈడీ అధికారులు ఆ కాల్‌ లిస్ట్‌ను ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. క్లబ్‌ మేనేజర్‌ ఆర్థిక వ్యవహారాల్లోనూ రకుల్ ఉంది. నవదీప్‌, కెల్విన్‌, రకుల్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఈడీ దగ్గర ఆధారాలున్నాయి. నవదీప్‌ ద్వారా క్లబ్‌ మేనేజర్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. కెల్విన్‌ అడ్డా కూడా ఎఫ్‌ క్లబ్బేనని భావిస్తున్నారు ఈడీ అధికారులు.
2017లో సే టూ నో డ్రగ్స్‌ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు రకుల్‌. డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ విచారణ కొనసాగుతున్న సమయంలోనే అవెర్నెస్‌ వాక్‌ జరిగింది. అయితే 2017 జులై 30న జరిగిన వాక్‌కు డుమ్మా కొట్టింది రకుల్‌. 2017 ఎక్సైజ్‌ కేసు ఆధారంగానే ఇప్పుడు విచారణ ఎదుర్కొంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌కు, నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌కు రకుల్‌ డబ్బులు బదిలీ చేసినట్టు ఈడీ గుర్తించింది. ఎఫ్‌ క్లబ్‌ పార్టీకి రకుల్‌తో పాటు రానా కూడా హాజరైనట్టు ఈడీ దగ్గర ఆధారాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 5 గంటలుగా ఈడీ అధికారులు రకుల్‌ప్రీత్‌సింగ్‌ను విచారిస్తున్నారు.ఎఫ్‌ క్లబ్‌ పార్టీ తెరపైకి రావడంతో ఇప్పుడు నవదీప్‌పై అందరి ఫోకస్‌ మళ్లింది. పార్టీకి హాజరైన యాక్టర్స్‌ నవదీప్‌ కంటే ముందుగానే ఈడీ ముందు హాజరవుతున్నారు. అయితే ఎఫ్‌ క్లబ్‌ ఓనర్‌ నవదీప్‌ని మాత్రం 9వ పర్సన్‌గా విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. దీంతో ఈ కేసులో ఇప్పుడు నవదీప్‌ కీలకంగా మారాడు. మరోవైపు కెల్విన్‌ అడ్డా కూడా ఎఫ్‌ క్లబ్‌గా భావిస్తున్నారు ఈడీ అధికారులు. దీంతో ఈ కేసులో ఎఫ్‌ క్లబ్‌ ఇప్పుడు కీలకంగా మారింది. ఎఫ్‌ క్లబ్‌కు ఎవరెవరు వచ్చేవారు ? ఎన్నిసార్లు పార్టీలు జరిగాయి? కెల్విన్‌ ఎవరెవరికి డ్రగ్స్‌ సరఫరా చేశాడో ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. నవదీప్‌ విచారణ సమయంలో ఈ విషయాలపై ఈడీ అధికారులు ఫోకస్‌ పెట్టే ఛాన్స్‌ ఉంది.మరోవైపు గత ఏడాది సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో కూడా రకుల్‌ని విచారించారు NCB అధికారులు. ఈ కేసులో 2020 సెప్టెంబర్‌ 26న NCB విచారణకు హాజరయ్యారు రకుల్‌. డ్రగ్స్‌ తీసుకున్నారనే అనుమానంతో రకుల్‌ని విచారించింది NCB. దాదాపు 4 గంటల పాటు ముంబైలో విచారించారు NCB అధికారులు. దీంతో టాలీవుడ్‌ డ్రగ్స్‌ లింకులతో పాటు ముంబై డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయా ? అని ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. అప్పటి కేసుపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Related Posts