YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి వర్సెస్ అశోక్ గజపతి

విజయసాయి వర్సెస్ అశోక్ గజపతి

విజయసాయి వర్సెస్ అశోక్ గజపతి
విశాఖపట్టణం, సెప్టెంబర్ 3, 
 దేవుని ఆస్తులు కొల్లగొట్టడంలో మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పాత్రపై అనుమానాలున్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. అశోక్‌ గజపతిరాజు ధర్మకర్తనా.. అధర్మకర్తనా..? అనే సందేహాల్ని ఆయన వ్యక్తం చేశారు. ఆలయ ఆస్తులు కాపాడతామన్న విజయసాయి.. అప్పన్న దేవాలయ భూముల వ్యవహారంలో ఏంచేశారన్నది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. అప్పన్న స్వామి భూములు అవకతవకల్లో ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్రపై అనుమానం కలుగుతోందన్నారు విజయసాయి.ఆలయ భూములు, దేవాలయం ఆస్తులలో అవకతవకలకు పాల్పడకపోతే, కోర్టుకు వెళ్లి మళ్ళీ పదవి ఎందుకు తెచ్చుకున్నారని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పంచగ్రామాల భూసమస్య న్యాయస్థానంలో ఉండటం వలన.. న్యాయ పరిధిలో త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు.అశోక్ గజపతి రాజు హయాంలో దేవాలయంలో అన్ని స్కాములే.. వాటన్నిటిని వెలుగులోకి తీసుకువచ్చి దేవాలయం ఆస్తులను కాపాడతాం. అసలు దేవస్థానం ఆస్తులు పరాధీనం పాలు అవుతుంటే ఏంచేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. 846 ఎకరాలు పరాధీనం చేస్తుంటే.. సుమారు 8 వేల కోట్లు దేవుడి ఆస్తులను కొల్లగొడుతూ ఉంటే.. తిరిగి వాటిని వెనక్కు తీసుకురాగలమా అనే మనోవేదన ఉంది. అశోక్ పైకి చెప్పేదొకటి.. లోపల చేసేది ఒకటి. ఇది వంశాచారమా.. లేక అపచారమా..? అని విజయసాయి ప్రశ్నల వర్షం కురిపించారు.

Related Posts