మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ
మంత్రి హరీష్ రావు
కరీంనగర్
హుజురాబాద్ లో జరిగిన రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ రావు పాల్గోని మాట్టలాడారు. నేను కూడా రిటైర్డ్ ఉద్యోగి బిడ్డనే. సీ,ఎం మంచి వేతన సవరణ చేసినందుకు కృతజ్ఞత సభ పెట్టుకుంటామని రిటైర్డ్ ఉద్యోగులు కోరితే వచ్చాను. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కృషి ఎనలేనిది. తెలంగాణ జైత్రయాత్ర, లేదంటే శవయాత్ర అనే నినాదమిచ్చి పట్టుదలతో ఆమరణ దీక్షకు బయలుదేరిన నేత కేసీఆర్. 14-15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే అంతా చీకటేనని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే.. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చేలా రాష్ట్రం ఎదిగింది. ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగి.. పక్క రాష్ట్రాలకు ఇస్తున్నాం. కరెంట్ కోతల నుంచి..అందరికీ 24 గంటల కరెంట్ ఇచ్చేలా ఎదిగామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బతికుండగా చూస్తామా అన్నారంతా. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సేకరిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవహేళన చేసారు. కానీ కాళేశ్వరం తొలి ఫలితం హుజురాబాద్ కే దక్కింది. గత ఎండకాలం ఎన్ని పంటలు పండాయో చూసారు. నీళ్లు వద్దని రైతులు కోరేంత వరకు నీళ్లు ఇచ్చుకున్నాం. దేశంలో అధిక ధాన్యం పండించే పంజాబ్ ను అధిగమించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు మన రైతులు. ఇక్కడ పండించిన వడ్లు జోకాలంటే కూలీలు కూడా దొరకనంతగా పంట పండింది. నాట్లు వేయడానికి ఝార్ఖండ్ నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. 70 ఏళ్లలో సాధ్యంకాని పనులెన్నో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడుసీఎం కేసీఆర్ విద్య, వైద్యంపై దృష్టి పెట్టారు. సింగరేణి కార్మికులకు ఆసరా ఫించన్ల కంటే తక్కువ వస్తుందని కోరారు.. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు కూడా ఆసరా ఫించన్లు ఇచ్చేలా శాయశక్తులా కృషి చేస్తా. ఆర్టీసీకి ఏడాదికి 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కాపాడుతుంటే.. కేంద్రం రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకశ్రయాలు అమ్ముతోంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. మన కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
కేంద్రం మన రాష్ట్రానికి లేఖ రాసింది. మేము అమ్ముతున్నాం, మీరు కూడా అమ్మితే బహుమానాలు ఇస్తామని కేంద్రం లేఖ రాసింది. కేసీఆర్ ఆస్తులు కూడబెడుతుంటే.. ఉన్న ఆస్తులను అమ్మకానికి పెడుతున్నది బీజేపీ ప్రభుత్వం. యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పి సీఎం ఆస్తులు పెంచుతున్నారు. ఆస్తులను పెంచేవాళ్లను నమ్మాలా ? అమ్మేవాళ్లను నమ్మాలా? ర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే.. ఇప్పటికే మూతపడేది కదా. ఫారిన్ డైరెక్ట్ ఇన్విస్టెమెంట్ కింద ఎల్.ఐ.సీని కూడా ప్రయివేటుకు అప్పగిస్తున్నారు. గతంలో పీఆర్సీ ఆలశ్యమైతే ఎరియర్స్ ఇచ్చేవాళ్లు కాదు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రిటైర్డ్ ఉద్యోగులకు ఎరియర్స్ ఇచ్చారు. లక్ష కోట్ల ఆదాయం కరోనా వల్ల తగ్గిపోయింది. మరోవైపు లాక్ డౌన్ వల్ల ప్రజలు నష్టపోయారు. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి సొంత ఖర్చులతో ప్రభుత్వం రైళ్లు ఏర్పాటు చేసింది. వైద్యం మీదనే దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసాం. ఎంత ఆదాయం తగ్గినా... అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగించారు. చల్లకొచ్చి ముంతదాచుడెందకని గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
హుజురాబాద్ ప్రజలకు ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందో ఆలోచించండి. జీడీపీ అంటే.. గ్యాస్, డీజీల్, పెట్రోలు ధరల పెంచడమన్న విధంగా కేంద్రం పనిచేస్తోంది. డీజీల్ ధరల పెంపుతో రైతులకు ట్రాక్టర్ల ద్వారా దున్నే కూలీల భారం పడింది. రైతు బంధు రూపంలో కుడిచేత కేసీఆర్ ఎకరాకు ఐదువేలిస్తుంటే.. ఎడమ చేత్తే డీజిల్ ధరలు పెంచి కేంద్రం లాక్కుంటోంది. టీఆర్ఎస్ 30 శాతం ఫిట్ మెంట్ ఉద్యోగులకిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 7.5 శాతమే ఇచ్చింది. కేంద్రం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలి. ప్రయివేటీకరణ వల్ల అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు కాడ పోతున్నాయి. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటు పరమైతే.. అక్కడ రిజర్వేషన్లు ఉంటాయా? బండి సంజయ్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి.. ఈ ప్రాంతంలో చిన్న పనైనా చేసారా? కేసీఆర్ కు దండం పెట్టైనా హుజురాబాద్ కు ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ తెస్తానని చెప్పాడు. మరి ఆ శక్తి బీజేపీ వాళ్లకు ఉంటుందా? ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజలకు మేలు కావాలని ఏమన్నా రాజీనామా చేసాడా? ఒక వేళ ఈటల గెలిస్తే.. వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుంది... హుజురాబాద్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. 2లక్షల 29 వేల మందికి మేలు జరగాలా.. ఒక్క ఈటలకే మేలు జరగాలా? ఈటలకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ప్రస్టేషన్ తో నాపై కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.