YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అద్దెలు బాబోయ్..

 అద్దెలు బాబోయ్..

మానుకోటలో పెరుగుతున్న అద్దె ఇళ్ల ధరలు సామాన్యులకు చుక్కలను చూపిస్తున్నాయి. ఇంటి స్థలం కొనలేని..ఇళ్లు నిర్మించుకోలేని నిస్సహాయ స్థితిలోని అనేక కుటుంబాలు భారంగా మారిన అద్దె చెల్లింపులతో సతమతమవుతున్నాయి. మానుకోట పట్టణం జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత లక్ష జనాభాకు చేరువైనట్లు అంచనా. దీంతో సహజంగానే అద్దె ఇళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది.

గిరాకీని క్యాష్‌ చేసుకునేందుకు యజమానులు అద్దెరేట్లు పెంచేస్తున్నారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం ధరలతో పోల్చుకున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో రెట్టింపయ్యాయి. జిల్లాకేంద్రంగా పట్టణం ఆవిర్భవించడంతో ఉద్యోగ, ఉపాధి రీత్యా పట్టణానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పట్టణంలో నివాసముంటూ జిల్లాలోని మండలకేంద్రాల్లో, గ్రామాల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలమైన ప్రాంతంగా మానుకోట ఉంటోంది. దీనికి తోడు మారుమూల, సమీ ప గ్రామాలకు చెందిన ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి, పిల్లల చదువు ల కోసం పట్టణంలో స్థిరపడిపోతున్నారు. దీంతో సహజంగానే అద్దె ఇళ్లకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ప్రస్తుతం మానుకోటలో ఒక గది కావాలంటే సుమారు రూ.2వేల వరకు వెచ్చించాల్సి ఉంటోంది. ఇక కుటుంబం కోసమైతే (ఫ్యామిలీ పోర్షన్‌) మూడు రూము లు, అపార్టుమెంట్‌, డబుల్‌ బెడ్‌ రూం, త్రి బుల్‌ బెడ్‌ రూం, ఇండివిజువల్‌ హౌస్‌లు అవసరమవుతున్న వారు వారి ఆర్థిక స్థోమతను బట్టి రూ.4వేల నుంచి రూ.10వేల వర కూ వెచ్చిస్తున్నారు.

 ఇంటిలో ఉండే మౌలిక వసతులు, సౌకర్యాలను బట్టి అద్దె పెరుగుతోంది. సామాన్యుడి కుటుంబం నివసించాలంటే రూ.4 నుంచి రూ.6 వేల వరకు ధర పెట్టాల్సిందే. పెద్ద కుటుంబం లేదా విలాసవంతమైన సౌకర్యాలున్న ఇంటి అద్దెలు రూ.10 వేల వరకు ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి జీవనోపాధి పొందడానికి వచ్చి చిన్నపాటి వ్యాపారం, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. తాము సంపాదిస్తున్న దానిలో సింహభాగం అద్దె చెల్లింపునకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అసలే పెరుగుతున్న ధరలతో ఉసూరుమంటున్న జనానికి అద్దెల ధరలు పెనుభారంగా మారుతున్నాయి. వచ్చే చాలీచాలనీ వేతనాలతో ఇంటి కిరాయిలు చెల్లిస్తూ తమ కు టుంబాన్ని పోషించుకోవాలంటే కష్టతరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఏంటి అని స్థలం కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుందామంటే భూముల ధరలకు రెక్కలొచ్చి చుక్కలు చూపిస్తున్నాయి. పేదలకు ఇంటి నిర్మాణ స్వప్నం అందన ద్రాక్షలా మారింది. సామన్య, మధ్య తరగతి కుటుంబీకులు ఇక ప్రభుత్వం ఇచ్చే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అది కూడా అదృష్టం కలిసిరాకుంటే జీవితాంతం అద్దె భారం మోయక తప్పదని వాపోతున్నారు.

Related Posts