YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నాలుగు శాఖలపై వేటు తప్పదా...

నాలుగు శాఖలపై వేటు తప్పదా...

విజయవాడ, సెప్టెంబర్ 4, 
ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌నపై అనేక ఊహాగానాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ధాన మీడియాలో సైతం మ‌రింత విడ్డూరంగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ త‌న కేబినెట్‌ను పూర్తిగా మార్చేస్తార‌ని.. తాను త‌ప్ప మిగిలిన 25 మంది మంత్రుల‌ను ఆయ‌న ఇంటికే పంపేస్తార‌ని.. అంద‌రినీ కొత్త‌వారిని తీసుకుంటార‌ని.. క‌థ‌నాలు రాస్తున్నారు. అయితే.. వాస్త‌వం ఏంటి ? నిజంగానే జ‌గ‌న్ అంద‌రినీ పంపేస్తారా ? కొత్త ముఖాల‌కే అవ‌కాశం ఇస్తారా ? ఇదే జరిగితే.. అత్యంత కీల‌క‌మైన రెండున్న‌రేళ్ల పాల‌న‌లో ఇబ్బందులు వ‌స్తే.. ఎలా త‌ట్టుకుంటారు ? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.దీనికి కొన్ని రీజ‌న్లు క‌నిపిస్తున్నాయి. ఎలా అంటే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలినాళ్ల‌లో కొంద‌రు మంత్రులు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వంలో మంత్రులు చేసిన ప‌నుల‌ను తాము అర్ధం చేసుకునేందుకు ఆరు మాసాల స‌మ‌యం ప‌ట్టింద‌ని.. కాబ‌ట్టి కొన్ని శాఖ‌లు క్రియా శీలం అయ్యేందుకు స‌మయం ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు. అవి కూడా కీల‌క‌మైన ఆర్థిక‌, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పుర‌పాల‌క శాఖ‌లు కావ‌డం గ‌మ‌నార్హం. ఇవి ప్ర‌భుత్వానికి అత్యంత కీల‌క‌మైన శాఖ‌లుగా చెబుతారు. ఎందుకంటే.. ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం అంతా ఈ నాలుగు శాఖ‌ల‌పైనే ఉంటుంది.సో.. ఈ శాఖ‌ల‌కు చెందిన మంత్రుల‌ను కూడా ఆచి తూచి ఎంచుకోవ‌డం క‌నిపిస్తుంది. గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఈ నాలుగు శాఖ‌ల మంత్రుల‌ను సీనియ‌ర్ల‌నే నియ‌మించారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా వీటిని.. సీనియ‌ర్ల‌కే అప్ప‌గించారు. ఆర్థిక మంత్రిగా.. బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, రెవెన్యూ మంత్రిగా ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, పుర‌పాల‌క మంత్రిగా సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణకు అప్ప‌గించారు. మిగిలిన శాఖ‌ల ప‌నితీరు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ నాలుగే ప్ర‌భుత్వానికి కీల‌కం. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ అంద‌రినీ మార్చేస్తార‌ని.. కొత్త ముఖాల‌కు మంత్రి ప‌ద‌వులు అప్ప‌గిస్తార‌ని.. జ‌రుగుతున్న ప్ర‌చారంలో ప‌స‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఎందుకంటే… వ‌చ్చే రెండున్న‌రేళ్లు కూడా.. అత్యంత కీల‌కం.. ఈ స‌మ‌యంలో ప్ర‌యోగాలు చేసేందుకు ఏ ప్ర‌భుత్వం కూడా సాహ‌సం చేయ‌దు. ఒక‌వేళ మంత్రివ‌ర్గాన్ని మార్చాల‌ని అనుకున్నా.. కొన్ని కీల‌క‌మైన శాఖ‌ల మంత్రుల‌ను మార్చేందుకు ఇష్ట‌ప‌డరు. కొత్త‌వారు వ‌చ్చి.. ప‌నిప్రారంభించేస‌రికి.. పుణ్య‌కాలం గ‌డిచి పోవ‌డం ఖాయం. సో.. ముందు తాను చెప్పిన‌ట్టే.. జ‌గ‌న్‌.. 90 శాతం మందిని కూడా కాదు స‌గం మంది మంత్రుల‌ను మాత్ర‌మే మారుస్తారంటున్నారు. పైగా..వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కం కావ‌డంతో అప్పులు తెచ్చేవారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించేవారు జ‌గ‌న్‌కు అవ‌స‌రం. అందుకే ఇప్పుడు కేబినెట్లో ఉన్న వారిలో మ‌రీ 80-90 శాతం మార్పులు ఉండే ప‌రిస్థితి లేదు.

Related Posts