హైదరాబాద్
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రజలకు శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే దానం, కార్పొరేటర్లు మన్నే కవిత , వెలదండ వెంకటేశ్ లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ,పేద ప్రజల కష్టాలను గుర్తించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. దీనిలో భాగంగానే ఆడ బిడ్డ తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టారు అని అన్నారు. వెంకటేశ్వర కాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని మొత్తం 73 మంది అర్హులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.