నెల్లూరు
కరోనా వైరస్ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఇళ్లలో మాత్రమే వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా వాసులకు సూచించారు. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం, పందిరి వేయడం, ఊరేగింపులు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. కరోనా వల్ల ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.