పారా ఒలింపిక్స్ లో 17కు చేరిన భారత్ పతకాలు
టోక్యో, సెప్టెంబర్ 4,
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు పసిడి పతకాల పంట పండుతున్నది. ఈ పారాలింపిక్స్‌లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా మరో ఆటగాడికి స్వర్ణం దక్కింది. ఈ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో షట్లర్ ప్రమోద్ భగత్ ( Pramod Bhagat ) ఘన విజయం సాధించాడు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వరుస సెట్లలో ఓడించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మనీశ్ నర్వాల్ వయసు 19 ఏళ్లే. ఇండియన్ షూటింగ్‌లో ఇప్పుడితనో సంచలనం. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి.. యువ సూపర్‌స్టార్ అయ్యాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన మనీశ్ నర్వాల్.. 2001, అక్టోబర్ 17న జన్మించాడు. టోక్యోలో జరుగుతున్న పారాఒలింపిక్స్‌లో పీ4 50మీ ఎయిర్ పిస్తోల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో మనీశ్ అందర్నీ స్టన్ చేస్తూ గోల్డ్ మెడల్ కొట్టేశాడు. నిజానికి ఇదే టోర్నమెంట్‌లో 10మీ ఎయిర్ పిస్తోల్ పోటీలో పతకాన్ని చేజిక్కించుకోలేకపోయిన నర్వాల్.. 50 మీ పిస్తోల్ ఈవెంట్‌లో మాత్రం తన సత్తా చాటాడు.దాంతో ఈ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతున్నది. వివిధ విభాగాల్లో భారత ఆటగాళ్లు చూపుతున్న ప్రతిభకు వరుసగా పతకాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా భారత్ షట్లర్ మనోజ్ సర్కార్ ( Manoj Sarkar ) కాంస్య పతకం కోసం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ పోరులో అద్భుత విజయం సాధించి మెడల్ దక్కించుకున్నాడు. జపాన్ షెట్లర్ దైసుకే ఫుజిహరాను వరుస సెట్లలో 22-20, 21-13 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. దాంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. అందులో నాలుగు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.