YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహిళల కోసం మోడీ రైస్

మహిళల కోసం మోడీ రైస్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6, 
బీజేపీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక సంస్కరణ పేరిట మరింత దూకుడు పెంచింది. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. జనధన్ ఖాతాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక రెండోసారి పొత్తుల ఎత్తులతో సంబంధం లేకుండానే బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చాయి. దీంతో మోదీ సర్కారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పార్లమెంటులో కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంటోంది. అయితే మోదీ సర్కారు దూకుడు వల్ల కొన్ని విమర్శలను సైతం ఎదుర్కోంటోంది.ప్రస్తుత కరోనా కట్టడిపై ఫోకస్ పెట్టిన బీజేపీ సర్కారు మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతోంది. భారతదేశంలోని మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని నివారించడానికి ఫోర్టిఫికేషన్ రైస్(బలవర్ధమైన బియ్యం)ను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ముందుగా మధ్యాహ్న భోజన పథకాల ద్వారా ప్రారంభిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోర్టిఫికేషన్ బియ్యాన్ని ఎలా తయారు చేస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు.ఒకప్పుడు మహిళలు ఇంటి పనులతోపాటు వ్యవసాయ పనులు చేసేవారు. అయిన వారంతా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అయితే నేటి మహిళలు కేవలం ఇంటి పనులకే బాగా అలసిపోతున్నారు. సాధారణంగా మహిళలు ఇంటి పనితోపాటు రకరకాలు పనులు చేస్తుంటారు. దీంతో వారికి ఎక్కువ మొత్తంలో శక్తి ఖర్చు అవసరం అవుతుంది. దీంతో వీరికి బలవర్థకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల స్త్రీలు పౌష్టికాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే 30ఏళ్లలోపు మహిళలు సైతం త్వరగా అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనికి పరిష్కారంగా మోదీ సర్కారు ఫోర్టిఫికేషన్ రైస్ ను తీసుకొస్తుంది.సాధారణంగా బియ్యాన్ని పాలిష్ చేయకుండా ఎవరూ వండుకోరని అందరికీ తెల్సిందే. అయితే పాలిష్ చేయడం వల్ల అందులో ఉండే ఖనిజాలు.. పోషకాలు పెద్దమొత్తంలో వెళ్లిపోతున్నాయి. కానీ బియ్యం పాలిష్ చేయకపోతే అందులో మలినాలు ఉంటాయని మరికొందరు అంటున్నారు. దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. దీంతో మాధ్యమేరవల్ల మలినాలు ఉంటాయని కొందరి వాదన. ఈ సమస్యను నివారించడానికి పోర్టిఫికేషన్ రైస్ ను పంపిణీ ఒక్కటే మార్గమని అంటున్నారు.సాధారణంగా వరిని పండించడం ద్వారా బియ్యం వస్తాయి. వీటిని పాలిష్ చేసిన తర్వాత పంపిణీ చేస్తున్నారు. దీంతో బియ్యంలోని పోషకాలు పోతున్నాయి. అయితే ‘బియ్యాన్ని పిండి చేసి అందులో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్స్ ఆఫ్ ఇండియా ఆమోదించిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలను కలిపి తిరిగి బియ్యపు గింజలుగా మారుస్తారు. దీనినే ‘ఫోర్టిఫైడ్ రైస్’ అంటారని న్యూయార్క్ చెందిన బయోలాజికల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడానికి బియ్యంతోపాటు ఇతర పప్పు ధాన్యాల్లో ఖనిజాలు, లవణాలను జత చేసే ప్రక్రియను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ చేస్తున్నాయి.మనదేశంలో ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయడానికి హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్(ఐసీఏఆర్)లో పరిశోధన చేస్తోంది. ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయడానికి 135 రోజులు పడుతుందట. హెక్టారుకు 50క్వింటాళ్ల దిగుబడి రాగా బియ్యాన్ని పాలిష్ చేసిన తర్వాత కూడా అందులో జింక్ అధికంగా ఉంటుందని ఐసీఏఆర్ పేర్కొంది. డీడీ ఆర్ ధన్ 45 అనే వరి రకాన్ని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పండించవచ్చని చెబుతోంది. ఈ రాష్ట్రాల్లో ఈ రకం వరి పంటను పండించడం ద్వారా భారీ మొత్తంలో ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయొచ్చని ఐసీఏఆర్ స్పష్టం చేస్తుంది.ప్రతీ కిలో ఫోర్టిఫైడ్ రైస్ లో 28 మిల్లీ గ్రాముల ఇనుము, 75 నుంచి 125 మిల్లి గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉండనుందట. ఈ రైస్ తినడం వల్ల మహిళల్లో రక్తహీనత లోపం దూరమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ఈ రైస్ కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మహిళల్లో పౌషికాహార లోపాన్ని నివారించవచ్చని అంటున్నారు. ఈ రైస్ పంపిణీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ దేశ ప్రజలకు ఈ రైస్ నే ఇవ్వాలని భారీగా పండించేందుకు రెడీ అవుతోంది. దీని పరిశోధనలకు కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోంది

Related Posts