కాబూల్, సెప్టెంబర్ 6,
అప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు, షంజ్ షేర్ యోధులకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. విజయమో.. వీరమరణామో అన్న రీతిలో షంజ్ షేర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడుతోంది. తమ మాతృభూమిని తాలిబన్లకు దక్కనిచ్చేది లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. నార్తర్న్ అలయెన్స్ పేరిట ఏర్పడిన గ్రూప్ ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కాకుండా పోరాడుతోంది. అయితే దీనికి విరుద్దంగా తాలిబన్లు మాత్రం తాము పంజ్ షేర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. రష్యాకు చెందిన ప్రముఖ మీడియా స్పుత్నిక్ పంజ్ షీర్ లోని పరిస్థితులను నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అప్ఘనిస్తాన్ ద్వారా తెలుసుకుంది. వారందించిన సమాచారం మేరకు ఇప్పటి వరకు షంజ్ షేర్ లో 600మంది తాలిబన్లు మృతిచెందారు. మరో వెయ్యి మంది రెసిస్టెంట్స్ దళాల ఆధీనంలో బంధీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. నార్తర్న్ అలయెన్స్ సైన్యాన్ని ఎదుర్కోలేక తాలిబన్లు వాళ్లంతట వాళ్లే లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నార్తర్న్ అలయెన్స్ పేరిట ఉన్న ట్వీటర్లోలోనూ ఈ విషయాలు ఉన్నాయి. దీంతో షంజ్ షేర్ తాలిబన్ల వశం అయిందన్న వార్తల్లో నిజం లేదని అర్థమవుతోంది.మరోవైపు తాలిబన్లకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ సహకారం అందిస్తోందని అమ్రుల్లా సాలేహ్ ఆరోపిస్తున్నారు. తాలిబన్ బద్రి 313 పేరిట 570మంది పాకిస్థాన్ ప్రత్యేక దళాలు, అల్ ఖైదా, ఐసీస్ ఉగ్రవాదులు నార్తర్న్ అలయెన్స్ సైన్యంపై దాడికి దిగుతున్నాయని తెలిపారు. వీరిని పాకిస్థాన్ ఐఎస్ఐ హెడ్ ఆపరేట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే పాకిస్థాన్ మాత్రం అమ్రుల్లా వ్యాఖ్యల్లో నిజం లేదని కొట్టిపారేస్తుంది. ప్రస్తుతం తాలిబన్లకు పంజ్ షేర్ సైన్యానికి మధ్య పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు తాలిబన్లు అప్ఘన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేలోగా వారిని అంతమొందించాలని నార్తర్న్ అలియన్స్ భావిస్తోంది. అక్టోబర్ నాటికి తాలిబన్లు పంజ్ షేర్ లోకి అడుగుపెట్టనీయకుండా చేస్తే ఈ ప్రాంత ముట్టడి వారికి మరింత కష్టంగా మారుతుందని భావిస్తున్నారు.చలికాలంలో తాలిబన్లు ఈప్రాంతంలో పోరాటం చేయడం కష్టసాధ్యంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో తమకు ఐదునెలల సమయం దొరుకుతుందని పంజ్ షేర్ సైన్యం భావిస్తుంది. ఈ సమయంలో తాము మరిన్ని ఆయుధాలు, శిక్షణ, శక్తి సామర్థ్యాలు పెంచుకునే అవకాశం దొరకనుంది. అలాగే విదేశీ శక్తుల మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఈక్రమంలోనే మరికొన్ని రోజులు వీరిమధ్య భీకర పోరు తప్పకపోవచ్చనే తెలుస్తోంది. దీంతో మరికొన్ని వారాలు ఈ రెండు దళాలకు కూడా కీలకంగా మారనున్నాయి. ఇదిలా ఉంటే పంజ్ షీర్ నేత అమ్రుల్లా సాలేహ్ తాజాగా తాలిబన్ సహా ఉగ్రవాదులపై పోరాటానికి తమ సైన్యానికి మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి నుంచి కూడా వారికి సహకారం అందే అవకాశం ఉండనుంది. ఏదిఏమైనా పంజ్ షేర్ ఇంకా తాలిబన్ల వశం కాలేదని తెలియడం అప్ఘన్లకు కొంత ఊరటనిచ్చే అంశంగా కన్పిస్తోంది