YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఒంటరిగానే హూజురాబాద్ బరిలోకి

ఒంటరిగానే హూజురాబాద్ బరిలోకి

కరీంనగర్, సెప్టెంబర్ 6 
దేశంలో ఏ పార్టీకిలేని ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. స్వాతంత్ర్య భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది కూడా కాంగ్రెస్సే. ఆ పార్టీకి అధికారంలోకి రావడం.. రాకపోవడం కొత్తేమీకాదు. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటోంది. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం రాష్ట్రాలపైన పడుతోంది. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ గెలిచిన తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎన్డీఏ సర్కారు వరుసగా పదేళ్లు అధికారంలో ఉండటంతో ఆపార్టీపై సహజంగానే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీనికితోడు కరోనా ప్రభావం మోడీ సర్కారుపై పడనుంది. పెట్రోల్, డీజీల్, నిత్యావసర, రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీకి మైసస్ గా మారనుండగా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ కానున్నాయి. మరోవైపు రోజురోజుకు మోదీ గ్రాఫ్ క్రమంగా పడుతోంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి వరంలా మారనుందిఅయితే వీటి ప్రభావం తమపై పడకుండా బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ముందుకెళుతోంది. కాంగ్రెస్ ముక్తభారత్ నినాదంతో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తోంది. బీజేపీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కాంగ్రెస్ ను బలహీన చేయడం ద్వారా తాము అధికారంలోకి వచ్చేలా మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.వరుసగా మూడోసారి కూడా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైతే ఆపార్టీ మళ్లీ కోలుకోవడం కష్టమనే టాక్ విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు ఢిల్లీలో అధికారంలోకి రావడానికి ఈజీ మార్గం. అందుకే ఇక్కడ సత్తాచాటడం ద్వారా వచ్చే ఎన్నికలకు సమరశంఖాన్ని పూరించాలని భావిస్తుంది.ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కారు బలంగా ఉంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ.. బహుజన్ సమాజ్ పార్టీలను కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాలను ప్రియాంక గాంధీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ఏమేరకు సమాయత్తం అవుతుందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఈసారి తాము కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్లేది లేదని సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇక యూపీలో దాదాపు రెండు వందలకు పైగానే చిన్నచితక పార్టీలున్నాయి. వీటిని కలుపుకుని పోయేందుకు బీజేపీ, ఎస్సీ, బీఎస్పీలు ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ పార్టీల వల్ల ప్రధాన పార్టీల ఓట్లు భారీగా చీలిపోయాయి.కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. ఈమేరకు ఉత్తరప్రదేశ్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని ఆపార్టీ భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీయే అమేధీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఏమేరకు సీట్లను సాధిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ చేస్తున్న ఈ సాహసం ఆపార్టీని గట్టెక్కిస్తుందా? లేదంటే నిలువునా ముంచుతుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
 

Related Posts