హైదరాబాద్
ఉప్పల్ లో మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన కీచక పాస్టర్ అరెస్ట్ అయ్యాడు. ఉప్పల్ లోని గాస్పల్ చర్చికు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు, పలు టీవీ ఛానల్లో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లను టార్గెట్ చేసుకున్నాడు. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగదీసుకొని మోసం చేస్తున్నట్లు పోలీసులుకు పిర్యాదు అందింది. పాస్టర్ ఆగడాలపై ఎంఆర్పీఎస్ నేతలు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ముగ్గురు అమ్మయిలు ఫిర్యాదు చేసారు. పాస్టర్ ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.