వెంకటగిరి
రాష్ట్రంలోని అనంతపురం పట్టణంలో భాష అనే ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండిస్తూ నేడు వెంకటగిరి ఫోటో గ్రాఫర్ &వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో నిరసన శాంతియుత ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు జిల్లా నేడు వెంకటగిరి ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నిరసన శాంతియుత ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు, పట్టణంలో వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ సభ్యులు ప్రకాష్ మాట్లాడుతూ అనంతపురంలో ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండిస్తూ ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు ఖాన్ షా భాష, సునీల్, రవి,కిషోర్, ప్రకాష్, శ్రీనివాస, ప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు