YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పలు అభివృద్ధి పనులకు స్పీకర్ పోచారం శంకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు స్పీకర్ పోచారం శంకుస్థాపన

నిజామాబాద్ సెప్టెంబర్ 6
వర్ని మండలంలోని ఎస్ఎన్ పురం పంచాయతీ పరిధిలోని కోటయ్య క్యాంపులో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కాపు సంఘం భవనానికి రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సోమబరం శంకుస్థాపన చేశారు.హుమ్నాపూర్ గ్రామంలో 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు భూమి పూజ చేసి, రూ. 36 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులకు, రూ. 10 లక్షలతో SC (మాదిగ) కమ్యునిటీ భవనం, రూ. 7.50 లక్షలతో గోసంగి కమ్యునిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అలాగే అసంపూర్తిగా ఉన్న SC (మాల) కమ్యునిటీ భవనానికి రూ. 5 లక్షలు, వెటర్నరీ భవనానికి రూ. 5 లక్షలు అదనంగా మంజూరు చేశారు. రాజ్ పేట  తండాలో నూతనంగా నిర్మించనున్న 20 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు భూమి పూజ, రూ. 9 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన  చేశారు. శంకోర తండాలో 45 డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ. చేసి, 28 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం మరియు రూ.10 లక్షలతో నిర్మించే సేవాలాల్ మహారాజ్ దేవాలయం కాంపౌండ్ వాల్, రూ.9 లక్షల అంగన్వాడీ భవనం, రూ. 9 లక్షలతో PACS గౌడాన్, రూ.10 లతో నిర్మించే సిసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు.ఈసందర్భంగా జరిగిన సభలో స్పీకర్ గారు మాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్ రూం ఇల్లు.తెలంగాణ రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే పదివేల ఇల్లు మంజూరు అయినాయి.మరో అయిదువేల ఇళ్ళను తెచ్చి మిగిలిన పేదలందరికి మంజూరు చేస్తానన్నారు.నియోజకవర్గ పరిధిలో స్వంత ఇల్లు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేయడమే నా ఆశయం.. రూ. 15000 కోట్లను రైతు బందు గా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ.దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే  రైతు బీమా ద్వారా ఆ రైతు కుటుంబానికి అయిదు లక్షల రూపాయల  నగదు అందుతుంది.పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళను తీసుకువచ్చాం..కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా గోదావరి నీళ్లు ఇప్పటికే నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయి.మల్లన్న సాగర్ జలాశయం నుండి ప్రత్యేకంగా తవ్వే మరో కాలువ ద్వారా రోజుకు అర TMC నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయి.బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నాన్ ఆయకట్టు పరిధిలోని భూములకు నీళ్ళందించడానికి రూ. 36.50 కోట్లతో చందూర్ ఎత్తిపోతలను మంజూరు చేశారు..
రూ. 70 కోట్లతో జాకోర ఎత్తిపోతల పథకంను మంజూరు
ఈ రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా 12,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.కరోనాతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతులు ఇబ్బందులు పడకూడదు అని ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి గత యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసింది.పేదల, రైతుల కష్టాలు తెలిసిన మనసున్న మహరాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే ఇన్ని సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటున్నారు.అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉన్నది.రాజకీయాలు హుందాగా ఉండాలి. విమర్శలు చేసే ముందు మీ జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి అభివృద్ధి చేసి, ఇలాంటి సంక్షేమ పథకాలను అమలుచేసి ఇక్కడ మాట్లాడండి.స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాలలో స్పీకర్ గారితో పాటుగా పాల్గొన్నారు.

Related Posts