YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వినాయకచవితి తర్వాత అసెంబ్లీ

వినాయకచవితి తర్వాత అసెంబ్లీ

హైదరాబాద్, సెప్టెంబర్ 6, 
తెలంగాణ శాసనసభ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల రెండోవారం తర్వాత వర్షాకాల అసెంబ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు మార్చి 15 నుంచి 26వ తేదీ వరకు జరిగాయి. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు అలస్యం అయ్యింది. అయితే, ఆరు నెలలకోసారి అసెంబ్లీ భేటీ కావాల్సి ఉన్న దృష్ట్యా ఈ నెల 26 లోపు సమావేశాలు కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై, ఆగస్టు నెలల్లో మధ్య కాలంలో నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అవి సాధ్యపడలేదు.కాగా, ఈ నెల 15న సమావేశాలు ప్రారంభించి పరిస్థితులను బట్టి 8–10 రోజులపాటు కొనసాగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి షెడ్యూల్‌ ఖరారు కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభించి, ఎన్నిరోజులు సమావేశాలు జరపాలన్న దానిపై శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తమ్మీద ఈ నెల 15–20వ తేదీలోపు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

Related Posts