కోరినకోర్కెలు తీర్చే కొంగు బంగారం పోచమ్మతల్లి
3వరోజు కొనసాగుతున్న ఆలయఉత్సవ వేడుకలు
జగిత్యాల, సెప్టెంబర్ 6
జగిత్యాల పట్టణంలోని పురానిపేటలో వెలిసిన లోకమాత పోచమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు భక్తుల భజనలు, మహిళల ప్రత్యేక పూజలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ 59 వ వార్షికోత్సవ వేడుకలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయడమే కాకుండా ప్రతిరోజు అమ్మవారికి విశేషపూజలు నిర్వహస్తున్నారు.మూడవ రోజు సోమవారం ఆలయంలో మాతలు ప్రత్యేక పూజలు చేయగా భక్తులు భజనలతో ఆధ్యాత్మికవాతావరణం నెలకొంది.కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతున్న పోచమ్మ తల్లి ఆలయంలో గత యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఉత్సవాలను వైభవంగా జరపడం హర్షణీయమని భక్తులు కొనియాడారు.ఆదిపరాశక్తి అంశతో జగిత్యాల పట్టణంలో స్వయంభూగా వెలిసిన పోచమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి ఏటా క్రమం తప్పకుండ జరపడం మనలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లికి మనం కృతజ్ఞత చెప్పినట్లేననీ పలువురు అభిప్రాయపడ్డారు.మహిళలు, భక్తులు పోచమ్మ తల్లి ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలుచేసి హారతి సమర్పించారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నo కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గాజుల రాజేందర్, నాగమల్ల మనోహర్, సంగెం సంఘం విద్యాసాగర్, జనగామ గంగాధర్, ములస్థం మల్లికార్జున్ , వడ్లుహరి, అంగడి మఠం సదాశివ్, డాక్టర్గా.జోజు రాజ గోపాల చారి, రాఘవాచారితో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.