YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 కమర్షియల్ గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమా  ‘టక్ జగదీష్` - ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌

 కమర్షియల్ గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమా  ‘టక్ జగదీష్` - ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌

 కమర్షియల్ గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమా  ‘టక్ జగదీష్` - ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌
'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత  నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం  'టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
టక్ జగదీష్ సరదాగా ఉండే కుర్రాడు. అది టైటిల్‌లోనే తెలియాలని అలా టైటిల్ ఫిక్స్ చేశాం. ఆ టక్ వెనకాల ఓ సిన్సియర్ కారణం కూడా ఉంటుంది. ఆ కారణం చూసి సెన్సార్ వాళ్లకు కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ సినిమాపై మా ఫీలింగ్ మారింది అని చెప్పారు. రేపు సినిమా చూశాక టక్ జగదీష్‌ను చూసే కోణం మారుతుంది.
నేను చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలోనే పెరిగాను. మా ఊరి వాతావరణంలోనే పెరిగాను. తాతగారింట్లో బాబాయిలు, అత్తలు అలా అందరి మధ్య పెరిగాను. నేను చూసిన ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించాలని, ఫ్యామిలీ డ్రామాను తీయాలని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అనుకున్నాను. ఇన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు చూసిన తరువాత కూడా శివ నిర్వాణగా నేను చేస్తున్న ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటే బాగుంటుంది..ఇన్ని సినిమాలు వచ్చాక కూడా ఓ ఫ్యామిలీ డ్రామాను తీసి మెప్పించాలంటే ఏదో కొన్ని కొత్త విషయాలు కూడా ఉండాలి. అందుకే నేను చూసిన ఎమోషన్స్‌ను మీకు చూపించాలని అనుకున్నా..
కథ,కథనం అనేవి వేరుగా ఉండవు.. టైటిల్స్‌లో అలా వేస్తాం కానీ కథ రాసుకునేటప్పుడు రెండూ కలిసే ఉంటాయి. ఇది చాలా బలమైన కథ. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు కూడా ఉంటాయి. కమర్షియల్ సినిమాకు ఉండే గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
ఈ సినిమాలో నాని ఓ సరదా మనిషి. బయటి నుంచి ఏ ప్రాబ్లం అయిన వస్తే ఇరగ్గొడతాడు. అదే ఇంట్లోనే సమస్య వస్తే  దాన్ని ఎలా పరిష్కరించాడు అనేది కథ.
విజిల్స్ పడే సీన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వాళ్లు కూడా థియేటర్లకు రాలేరు. కానీ ఇప్పుడు నానమ్మ, అమ్మమ్మలతో కలిసి ఇరవై ఏళ్ల కుర్రాడు కూడా కలిసి చూస్తాడు. ఇప్పుడు ఓటీటీలో రావడంపై నెగెటివ్ కన్నా పాజిటివ్‌లే చూస్తున్నాను.
నాని గారితో వెంటనే ఓ సినిమా చేయాలని అనుకున్నప్పుడు.. ఆయన ఆఫీస్‌కు రమ్మన్నారు. పది నిమిషాల్లోనే కథ చెప్పాను. ఆ చెప్పడమే ఓ ట్విస్ట్‌తో చెప్పాను. అది బాగా నచ్చింది. వెంటనే ఓకే అన్నారు. కానీ ఆయన నేను లవ్ స్టోరీ చెబుతాను అని అనుకుని.. నాకు ఎలా నో చెప్పాలని నాని అనుకున్నారు. కానీ చెప్పడమే.. భూదేవీపురం, భూకక్షలు అని చెప్పడంతో నాని ఎగ్జైట్ అయ్యారు.
లెక్కలు వేసి ఈ కథను చేయలేదు. ఇది ఇంటెన్స్ కథ. మాస్, ఐటం సాంగులు ఉండవు. ప్రారంభం నుంచి చివరి వరకు కనెక్ట్ అవుతుంటారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మధ్య ఉండే కథలు కొత్తగా ఏం ఉంటాయి. ఆ సంఘర్షణను ఎంత కొత్తగా చూపిస్తామనేది ఇంపార్టెంట్. ఇందులో కథనం అందరినీ ఆకట్టుకుంటుంది. నిన్నుకోరి సినిమాలో ఓ సంఘర్షణ ఉంటుంది.. మజిలీలోనూ ఓ కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇందులో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే గొడవలు, అసూయలపై టక్ జగదీష్ ఉంటుంది. ఆ పాత్రల ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. నేను హైద్రాబాద్‌కు వచ్చి పద్నాలుగేళ్లు అవుతుంది. కానీవచ్చింది ఊరి నుంచి. ఈ సినిమా చూస్తే మనకు ఇప్పటి జీవితం గుర్తుకు రాదు. మన ఊరు కనిపిస్తుంది. అందరినీ అలా మన ఊర్లోకి తీసుకెళ్తుంది. మన కళ్లు తడుస్తాయి. ఓ మంచి ఫీల్ ఇస్తుంది. నాని టక్ జగదీష్ పాత్ర సరదా ఉంటూనే.. పవర్.. ఎమోషన్స్ ఉంటుంది. ఇలా మూడు షేడ్స్ ఉంటాయి. జాతర సీన్ అదిరిపోతుంది. గరగ కట్టుకోవడం అనేది చాలా ఊర్ల‌లో జాత‌ర‌లో చూస్తుంటాం. మా ఊరి జాతరలో కూడా ఉంటుంది. గోపీ సుందర్ గారితో నేపథ్య సంగీతం చేయిస్తున్నప్పుడు ఓ చిన్న బిట్ సాంగ్ ఉండాలని అనిపించింది. టక్ జగదీష్ పాత్ర గురించి ఇంట్రో సాంగ్ ఉంటే బాగుంటుందని అన్నారు. నేను టీచర్‌గా పని చేశాను. అదే స్లాంగ్‌లో పాట పాడి వినిపిస్తే.. నాని బాగున్నారు. తీసేద్దామని నేను అంటే.. ఉంచేయ్  బాగుంది క‌దా అని నాని అన్నారు. సాధార‌ణంగా నేను పాడను కానీ సందర్భం వచ్చింది. నిన్ను కోరి సమయంలోనూ ఇలానే జరిగింది. నాలుగు పదాలు నాకు తడితే అలా రాసేస్తాను. పూర్తి సాంగ్ నేను రాయలేను.. అది లిరిక్ రైటర్స్‌కే వదిలేస్తాను. ఏడెత్తు మల్లెలు సమయంలోనూ అంతే. భాస్కర భట్ల రాలేకపోవడంతో.. ఆ ట్యూన్‌లో ఇంకొన్ని పదాలు పడితే బాగుండు అనిపించింది. అందుకే రాశాను. దర్శకులందరూ కూడా ఎమోషన్స్ బాగా చూపిస్తారు. శుభ సంకల్పం సినిమా చూసి ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను. అందుకే నేను కూడా ఏదైనా తీస్తే అందరూ ఎమోషన్ ఫీల్ అయ్యేలా ఉండాలని అనుకున్నాను. కానీ నాక్కూడా పడి పడి నవ్వుకునే సినిమా తీయాలని ఉంది. కథ ఏది కోరితే ఆ ఎమోషన్ ఇవ్వాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపీ సుందర్ గారు చేస్తే బాగుంటుందని ఆయనతో చేయించాను. మజిలీ సినిమాకు పాటలు గోపీ సుందర్ చేస్తే.. బ్యాక్ గ్రౌండ్ తమన్ చేశారు. టక్ జగదీష్‌కు లైట్ హార్టడ్ మ్యూజిక్ కావాలి.. అలాంటి సీన్లే ఎక్కువున్నాయి. గోపీ గారి మ్యూజిక్ లైట్‌గా ఉన్నా.. ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. అందుకే అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాలో ఏముందో ట్రైలర్‌లో కూడా అదే చెబుతాను. అలా చెప్పేందుకు నేను ఎప్పుడూ భయపడను. ఉన్న నాలుగు జోకులు ట్రైలర్‌లో కట్ చేసి, ఉన్న నాలుగు యాక్షన్ షాట్స్ పెట్టి.. తీరా సినిమా చూస్తే ఏంటి ఇలా ఉందని అనుకుంటారు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల నుంచి చివరి వరకు కనెక్ట్ అవుతుంది. కమర్షియల్ సినిమాల్లో ఇది కొత్తగా ఉంటుంది. మంచి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి.. పాటలు, ఫైట్లు కూడా కథలో భాగంగానే వస్తాయి. వెళ్తాయి. మూడు ఫైట్ సీన్స్ ఉన్నాయి.. నాలుగున్నాయని చెప్పడం నాకు నచ్చదు.

Related Posts