ముకేశ్ అంబానీ ఇంట మరో శుభ కార్యం జరుగనుంది. ముకేశ్ కుమార్తె ఈశా అంబానీ కి పిరమాల్ సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్‌తో వివాహం జరగనుంది. ఈ రెండు కుటుంబాల మధ్య 40 ఏళ్లుగా చక్కటి స్నేహబంధం ఉంది. ఇటీవలే ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్‌కు వజ్రాల వ్యాపార దిగ్గజం రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకతో వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈశా అంబానీ ఆలోచనతోనే జియో ప్రారభించడం
జరిగింది.