YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డొంకరాయి జలాశయానికి వరద నీరు

డొంకరాయి జలాశయానికి వరద నీరు

డొంకరాయి జలాశయానికి వరద నీరు
సీలేరు
సీలేరు కాంప్లెక్సులోని డొంకరాయి జలాశయం నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా డొంకరాయి జలాశయం పరిసర ప్రాంతాల్లో కొండలపై విస్తారంగా వర్షాలు కురవడంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా.1036.5 అడుగులకు చేరుకోవడంతో జెన్కో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా రెండు గేట్ల ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనిపై ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్సు ఎస్ఈ రామకోటిలింగేశ్వరరావు మాట్లాడుతూ.. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వలసగెడ్డ, పాలగెడ్డ వాగులతోపాటు కొండ ప్రాంతాల నుంచి పది వేలకు క్యూసెక్కులకు పైగా వరదనీరు డొంకరాయి జలాశయంలోకి చేరుతుందన్నారు. దీంతో జలాశయం నీటిమట్టం 1036 అడుగులు కొనసాగేలా రెండు గేట్లు ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. మరోవైపు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని పవర్ కెనాల్ ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. అలాగే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరిగేలా చర్యలు చేపడుతున్నామని, శనివారం పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో 2.2 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి జరిగిందని ఎస్ఈ రామకోటిలింగేశ్వరరావు తెలిపారు.

Related Posts