YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అటల్ పెన్షన్ కు భారీ ఆదరణ

అటల్ పెన్షన్ కు భారీ ఆదరణ

ముంబై, సెప్టెంబర్ 7,
నియర్‌ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్‌ పథకం అటల్ పెన్షన్‌ యోజన (ఏపీవై)కు భారీ ఆదరణ దక్కుతోంది.  ఏపీవైని నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) కంట్రోల్‌ చేస్తుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 4.2 కోట్ల మంది ఎన్‌పీఎస్‌ ఖాతాదారుల్లో 66 శాతం మంది (2.8 కోట్ల మంది) ఏపీవైకి దరఖాస్తు చేసుకున్నారు. నాన్‌–మెట్రో సిటీల నుంచి ఏపీవైకి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. 2021 నాటికి ఎన్‌పీఎస్‌ అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏయూఎం) విలువ 38 శాతానికి పైగా పెరిగి రూ.5.78 లక్షల కోట్లకు చేరింది.  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) ఎన్‌పీఏ స్కీమ్‌ను నిర్వహిస్తుంది.  అటల్ పెన్షన్ యోజనను  2015 మే నెలలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం 18–-40 సంవత్సరాల వయస్సు గల వారికి వర్తిస్తుంది. ఏపీవై చందాదారులకు 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ.వెయ్యి నుంచి రూ.ఐదు వేల వరకు పెన్షన్ వస్తుంది. లబ్దిదారుడు మరణిస్తే ఈ మొత్తాన్ని అతడు/ఆమె కుటుంబానికి చెల్లిస్తారు. ఎన్‌పీఎస్‌లో నెలకు  రూ .1500 (రోజుకు రూ. 50) పొదుపు చేస్తే.. ఉద్యోగికి 60 ఏళ్లు వచ్చినప్పుడు రూ.34 లక్షలు పొందవచ్చు.  ఇందుకోసం వరసగా 25 సంవత్సరాల పాటు  ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.  ఫలితంగా వీళ్లు నెలకు రూ. 9000 వరకు పెన్షన్ పొందవచ్చు. అయితే, మార్కెట్లలో ఆటుపోట్ల కారణంగా ఈ అంచనాలు మారే అవకాశాలు ఉంటాయి. -35 ఏళ్లకు ఉద్యోగి చెల్లించే మొత్తం రూ. 6.30 లక్షలు అవుతుంది. దీనిపై రూ .27.9 లక్షల వడ్డీ వస్తుంది. దీంతో -రిటైర్మెంటు నాటికి కార్పస్‌ విలువ రూ. 34.19 లక్షలకు చేరుతుంది. ఎన్‌పీఎస్.. మార్కెట్-లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్. ఉద్యోగి రిటైర్ అయ్యే లోపు కార్పస్ విలువ పెరుగుతుంది. ఫండ్ మేనేజర్లు సాధారణంగా ఈక్విటీ,  డెట్ వంటి  స్కీముల్లో నిధులను ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా ఇన్వెస్టర్ కు భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి.

Related Posts