వేసవిలో ఎండల తీవ్రత పెరగడంతో చెరువుల్లో నీరు క్రమేపి తగ్గిపోవడంతో ఉన్న నీరు కలుషితమవడం వల్ల అందులో పెరుగుతున్న చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఎప్పటికప్పుడు మత్సశాఖ అధికారులు జిల్లాలోని మత్యకార సోసైటీల సభ్యులకు వాటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాతావరణ ప్రభావం వలన అనుకున్న స్థాయిలో మత్యకారులకు చేపలు అందలేక పోతున్నాయి. జల సంక్షోభంతో విలవిలలాడుతోంది. నిత్యం నీటితో,మత్స్య సంపదతో కళకళలాడే కొల్లేరు సరస్సు..నీళ్లులేక నిర్జీవమైపోయింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎండిపోయి కనుచూపుమేర ఎడారిని తలపిస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతాన్ని చూస్తుంటే ఏ బీడుభూమిలాగానో కనిపిస్తోంది కదూ..కానీ ఇదే మంచినీటి సరస్సుగా చరిత్రగాంచిన కొల్లేరు సరస్సంటే మీరు నమ్మగలరా? ఇది నిజం...వేసవిలో సైతం పుష్కలంగా నీటితో, మత్స్య సంపదతో, పచ్చనిగడ్డితో కళకళలాడే కొల్లేరు ఎడారిగా మారిపోతున్నాయి.మత్సకారులు అధిక రాబడి పొంది లాభాల బాటన నిలువాలంటే కచ్చితంగా మత్సశాఖ అధికారులు సూచించిన నియమ నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా మత్సశాఖ అధికారులు తెలుపుతున్నారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువ చేపల సాంద్రత ఉండటం, క్రమేపి నీరు తగ్గటం, ప్రాణవాయువు కొరత, నీటినాణ్యత తగ్గిపోయి ఘారత పెరగడం మొదలగు కారణాల వలన చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. కొన్ని సంద ర్భాలలో పెద్దమొత్తంలో చేపలు చనిపోవడమే కాకుండా రోగ కారక సూక్షజీవుల వలన వ్యాధులు సంభవించే అవ కాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని జిల్లా మత్సశాఖ అధికారులు తెలుపుతున్నారు.* చెరువులోని నీటి నాణ్యత, లోతు విస్తీర్ణము, చేపల కదలికలు ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. చెరువులోని కొన్ని చేపలను మచ్చుకుపట్టి వాటి ఎదుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావాన్ని, ముప్పెల రంగు, శరీరంపై జిగురు మొద లగు లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన యెడల స్థానిక మత్సకార అధికారుల సూచనలు తీసుకుని నివారణ, నియంత్రన చర్యలు సత్వరమే చేపట్టిన యెడల ఆర్థిక నష్టాన్ని కొంతైనా మెరుగు పర్చుకోవచ్చు.* ఉదయాన్నే చేపలు చెరువు పై భాగానా నోరు తెరుచుకుని తిరుగుతూ ఉంటే అట్టి చెరువులో ప్రాణవాయువు కోరత ఉందని గమనించాలి, అలాంటి సందర్భాల్లో మత్సకారులు చెరువులో బోర్ల ద్వారా నీటిని నింపడము చేయాలి, అది సాధ్యం కాని పక్షంలో పెద్దగా పెరిగిన చేపలను పట్టి అమ్మివేసుకోవాలి. దీని వలన చెరువులో చేపల సాంద్రత తగ్గి పోయి ప్రాణ వాయువు కొరతను అధిగమించవచ్చు. కానీ మత్సకారులు చేపల ఎదుగుదల రాలేదనో లేదా మార్కె ట్‌లో రేటు తక్కువగా ఉందనో లేదా ఐస్ దొరకకపోవడం అంటూ మొదలగు కారణాల వలన నిర్లక్షం చేస్తుంటారు. దీని వలన మత్సకారులు మరింత నష్టపోయే అవకాశముంది.
* చెరువులలో నీటి నాణ్యత తగ్గిపోయినప్పుడు సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజిల వరకు చెరువు లలో చల్లిన యెడల నీటి నాణ్యత పెరగడమే కాకుండా ప్రాణవాయువు శాతం పెరిగి చేపలు బ్రతికే అవకాశ ముంటుంది.
* మత్సకారులు చెరువులోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తగ్గిస్తుండాలి, లేని యెడల రాత్రి సమయాలలో అవి కేవలం కార్బన్‌డైఆక్సైడ్ విడుదల చేయడం వలన చేపలకు తీవ్ర ప్రాణవాయువు కొరత ఏర్పడి పెద్ద మొత్తంలో చనిపోతుంటాయి కాబట్టి మత్సకారులు కలుపుమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
* కొన్ని సందర్భాలలో వ్యాదితో చేపలు చనిపోతుంటాయి. అలాంటప్పుడు చనిపోయిన చేపలను వెంటనే తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి, లేని యడల గోతి తీసి పూడ్చివేయాలి. అనంతరం ప్రాణవాయువు కొరకు పైన సూచించిన సున్నాన్ని నీటిలో కలపాలి. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే నీటి నాణ్యత పెంచి రసాయనాలు బెం జాల్ కొలియం క్లోరైడ్ ను ఒక హెక్టారుకు ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. దీని వలన నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరణాజీవులు చనిపోతాయి. ఇవన్ని చేసిన తదుపరి కూడా ఎలాంటి మార్పు రాకపోతే చివరి అస్త్రంగా ఆంటీబైటిక్ (రోగనిరోదక) మందులను సూచించిన మోతాదులో చేపల మేతతో పాటు కలిపి ఇవ్వాలి.
* చెరువులలో ప్రాణవాయువు పెంచుకోవాడానికి నీటని మోటార్ల ద్వారా రీసైకిలింగ్ చేసుకున్న యేడలా విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. పై తెలిపిన సందర్భాల్లో చేపలను పట్టడం అత్యంత శ్రేయస్కరం.
మత్సకారులు ఎప్పటికప్పుడు చెరువులోని చేపలను గమనిస్తూ చేపల సామర్ధానికి నీటి సామర్ధం సరిపడుతుందా అనే విషయంపై ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రాణవాయువు విషయంలో అధికారులు సూచించిన నియమ నిబందనలు పాటించిన యెడల మత్సకారులు అధిక దిగుబడితో పాటు అధిక లాభాలు పొందుతారని జిల్లా మత్సశాఖ అధికారులు తెలియజేస్తూన్నారు.