YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తే దళిత బంధు వస్తది, నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది

మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తే దళిత బంధు వస్తది, నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది

హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజవర్గం రామకృష్ణాపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఎన్టీఆర్ నగర్ లో పాదయాత్ర నిర్వహించారు.  మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  రాజీనామా చేసినట్లయితే  ప్రతిఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు  లభిస్తుందని, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సబితా ఇంద్రా రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని పక్షంలో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. కెసిఆర్ కేవలం హుజరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలలోని దళితులందరికి దళిత బంధు పథకం అమలు చేయాలని అలాగే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన గిరిజన మైనారిటీ బిసి లకు కూడా పది లక్షల ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు చిలక ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంతోష్  ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts