విశాఖపట్నం
వి.ఎం.ఆర్.డి.ఏ మాస్టర్ ప్లాన్ అవినీతి మయంగా ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు.విశాఖలో మాట్లాడుతూ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి హనుమంతువాక వరకు రోడ్ ప్రతిపాదులు మాస్టర్ ప్లాన్ లో చేర్చడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు.పెందుర్తి లో గ్రీన్ బెల్ట్ లో కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చిందని,రైతులు సాగు చేస్తున్న భూములు గ్రీన్ బెల్ట్ గా మార్చారని అన్నారు.గత వి.ఎం.ఆర్.డి.ఏ కమిషనర్ పై విచారణ జరిపించాలని,గతంలో అవినీతికి పాల్పడిన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఉన్నత పదవులు ఇచ్చారని,అవినీతి కి విశ్వరూపం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిందని విమర్శించారు.వి.ఎం.ఆర్.డి.ఏ చరిత్రలోనే అత్యంత అవినీతి జరిగిందని,16 వేలకు పైగా అభ్యంతరాలు వస్తే వాటిని ఎందుకు పరిగణంలోకి తీసుకోవడం లేదని నిలదీశారు.రిజర్వ్ ఫారెస్ట్ లో అడ్డగోలుగా రోడ్ ఎలా వేస్తారని,విశాఖ లో అక్రమాలపై విజయసాయి రెడ్డి ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ ను బహిర్గతం చెయ్యాలన్నారు.వి.ఎం.ఆర్.డి.ఎ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.