సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా కోటంభేటి భారతి
నెల్లూరు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారిసత్రం మండల తనియాలి గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్, యానాది గిరిజన కులానికి చెందిన కోటంభేటి భారతిని సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఈమెకు యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ భారతి కి ప్రాధాన్యం ఇచ్చి డైరెక్టర్ గా ఎంపికకు సహకరించిన సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వైసిపీ పెద్దలందరికీ దన్యవాదాలు తెలిపారు. యానాదుల అభ్యున్నతికి కృషి చేయాలని భారతిని కోరుతూ,గిరిజనజాతి తరపున ఆంధ్రప్రదేశ్ యానాదుల గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కెసి పెంచలయ్య
శుభాకాంక్షలు తెలియజేశారు.