YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొనసాగుతున్న మన తెలంగాణ - మన వ్యవసాయం

కొనసాగుతున్న మన తెలంగాణ - మన వ్యవసాయం

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో  మన తెలంగాణ- మన వ్యవసాయం కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలి.. ఎలాంటి విత్తనాలు నాటాలి.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రాయితీలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో రైతులకు వ్యవసాయ శాఖ, సంబంధిత 12 శాఖల అధికారులతో మంగళవారం నుంచి జూన్ 5వ తేదీ వరకూ రైతు చైతన్య యాత్రలు నిర్వహించనున్నారు.‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ పేర ఈ యాత్రలు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు వ్యవసాయ శాఖ సంచాలకులు రోజ్‌లీలా తెలిపారు. 52 మండలాల్లోని 1,600 గ్రామాల్లో ఈ యాత్రలు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం రైతు చైతన్య యాత్రల పేరిట నిర్వహించేవారు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మన తెలంగాణ-మన వ్యవసాయం పేర యాత్రలు నిర్వహిస్తున్నారు.ప్రతి గ్రామపంచాయతీలో వ్యవసాయశాఖ, వాటి అనుబంధ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అందుకుగాను ఇప్పుడే తగిన ప్రణాళికలు తయారు చేసుకోవాలని  అధికారులు సూచించారు. ప్రతి ఐదు వందల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో రైతుల డేటా, ఆధార్‌నంబర్, బ్యాంకు ఖాతా నంబర్ తీసుకుని సర్వే నిర్వహించి రైతు సంతకం తీసుకోవాలని తెలిపారు. రైతులకు పాంపాండ్స్ స్టోరేజ్ ట్యాంకులను సర్వే చేయాలని, హరితహారంలో ఏ రైతుకు మొక్కలు ఇవ్వాలని కూడా సర్వే చేసి ప్రతి సంవత్సరం లాగే రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం ముందు రైతులను సిద్ధం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి గ్రామంలో రైతు సదస్సు ఉదయం 7గంటల నుండి ఉదయం 11.30గంటల వరకు మండలం నుండి ఒక టీంగా మండల వ్యవసాయాధికారి, పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్య, విద్యుత్, ఇరిగేషన్‌శాఖలు, బ్యాంకు, రెవెన్యూ, వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఒక గ్రూపుగా ఏర్పాడి రోజుకు రెండు మూడు గ్రామాల చోప్పున మన తెలంగాణ- మన వ్యవసాయంపై రైతులకు వ్యవసాయం చేసేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు, వ్యవసాయశాఖ ద్వారా ఆమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించి రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. 

ఉద్యాన పంటలపై దృష్టి సారించండి...

ఒకే పంటపై ఆధారపడి ఉండకుండా, ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌దాస్ అన్నారు. మన తెలంగాణ- మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా మండలంలోని వైజాపూర్, కమలాపూర్ గ్రామాల్లో  ఏర్పాటు చేసిన రైతు చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. పండ్ల తోటలసాగు, వాటి లాభాలు వివరించారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి స్ప్రింక్లర్లు, డ్రిప్ పద్ధతులను ఉపయోగించుకొని లబ్ధిపొందాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ ధరకు ఇస్తున్నారని తీసుకోవద్దని, లైసెన్స్ ఉన్న షాపు డీలర్ల వద్దనే విత్తనాలను తీసుకొని, రశీదు తీసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకుడు జి.రాంకిషన్ రైతులకు సూచించారు. వర్షాకాలంలో సాగులో పాటించాల్సిన మెళకువల గురించి వివరించారు. పశువైధ్యాదికారి జీవన్ మాట్లాడుతూ.. వర్షా కాలంలో వచ్చే వ్యాధులు, నివారణ, టీకాల గురించి చెప్పారు. సబ్సిడీపై గొర్రెల, కోళ్ల పెంపకాలను వివరించారు. భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందజేశారు

Related Posts