YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం అన్న బండి ఎక్కడ ఉన్నావు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రు.10 వేల ఆర్థిక సహాయం.  మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ డిమాండ్

ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం అన్న బండి ఎక్కడ ఉన్నావు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రు.10 వేల ఆర్థిక సహాయం.  మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ డిమాండ్

ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం అన్న బండి ఎక్కడ ఉన్నావు
      వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రు.10 వేల ఆర్థిక సహాయం
    మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ డిమాండ్
హైదరాబాద్ సెప్టెంబర్ 7
ఉత్తర తెలంగాణ జిల్లాలు కూడ తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమే. ఈ రోజున ఆ జిల్లాలోని ప్రజలు విపరీతమైన వర్షం పడటంతో వేలాది ఇళ్లు మునిగి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పూర్తిగా అచేతనంగా నిలబడి ఉందని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసారు.హైదరాబాద్ పట్టణ వాసులు మాత్రమే తెలంగాణ వాసులు కాదు. ఉత్తర తెలంగాణలో తెలంగాణ ఆకాంక్ష కొరకు పని చేసి ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు కూడా తెలంగాణ ప్రజలే  అన్నది గుతిన్చ్జలన్నారు.ఎన్నికలు లేని కారణంగా హైదరాబాద్ నగరంలో నష్టపరిహారం కింద ఇచ్చిన పది వేల రూపాయల లబ్ధి తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఉత్తర తెలంగాణ నే కాదు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి పదివేల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేసారూ.వరదల వల్ల నష్టపోయి మొత్తం ఆహార ధాన్యాలు అన్నీ తడిసి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు అందరికీ కూడా తినుబండారాలు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన ప్రజలకు బండి పోతే బండి ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం అని అన్న బండి సంజయ్ ఎక్కడ ఉన్నావని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ జిల్లాలో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్ లతో పాటుగా అనేక ప్రాంతాలు మునిగి రైతాంగం నష్ట పోతుంటే ఇండ్లు మునిగినటువంటి ఈ పరిస్థితుల్లో లోపల ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వేమో టిఆర్ఎస్ తో ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా నువ్వు ఏదో పాదయాత్ర చేస్తున్నావని ఎద్దివచేసారు.ముందు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లుగా నియోజకవర్గంలో ఉన్న ప్రజల పరిస్థితి చూడమని కోరుతున్నా. అంతేగాని మీరు ఏదో మాట్లాడుకుంటూ పోతే ఉంటే నడవదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి వెంటనే 10 వేల రూపాయలు హైదరాబాద్ లో ఇచ్చిన విధంగా ఇవ్వాలి. అదేవిధంగా బండి సంజయ్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని వెంటనే వచ్చి పర్యవేక్షణ చేయాలని  డిమాండ్ చేసారు.

Related Posts