పెంచల కోన దేవస్థానం చైర్ పర్సన్ గా చెన్ను తిరుపాలు రెడ్డి
కోన దేవస్థానానికి నూతన పాలకవర్గం నియామకానికి గ్రీన్ సిగ్నల్
నెల్లూరు
దక్షిణ భారతదేశంలోనీ ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ నియామకానికి ఎట్టకేలకు దేవాదాయ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు పెంచలకోన దేవస్థానం కార్య నిర్వాహణాధికారికి 12 మంది పాలకవర్గం సభ్యుల నియామక ఆమోదంతో ఆదేశాలు అందాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రం లో స్వయంభువుగా వెలసి ఉన్న శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకవర్గ నియామకం త్వరలోనే జరగనున్నట్లు సమాచారం. పాలకవర్గం లోని12 మంది సభ్యుల్లో ఒకరైన రాపూరు మండలం తానంచర్ల గ్రామానికి చెందిన చెన్ను తిరుపాలు రెడ్డి ని చైర్మన్ గా ఎన్నుకోవడం కేవలం లాంఛనప్రాయమే. దేవదాయ శాఖ నుంచి ఆమోదం పొందిన పాలకవర్గ సభ్యులు వరుసగా చెన్ను తిరుపాలు రెడ్డి, కరిపోగు సుబ్బమ్మ, వడ్ల పల్లి పెంచలయ్య, చర్ల లక్ష్మీ ప్రసన్న, యాకసిరి అంకమ్మ, మేడికొండ అనిల్ కుమార్ , ముప్పాళ్ళ సునీత, కండె రమణయ్య, మోడే పల్లి ఇందిర, గాలం రత్నమ్మ, గుండు విజయ్ కుమార్ రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యులుగా కోన దేవస్థానం ప్రధాన అర్చకులు గుoడ్లూరు సీతారామయ్య లను నియమిస్తూ దేవదాయ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.