YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖమ్మం లో 50 కోట్ల బీరు అమ్మకాలు

ఖమ్మం లో 50 కోట్ల బీరు అమ్మకాలు

ఖమ్మం జిల్లాలోని మందుబాబులు ఈ వేసవిలో ఏంచెక్కా కోట్లాది రూపాయల విలువ చేసే బీర్లను సేవించారు. రెండు నెలల వ్యవధిలో రూ.45.07కోట్ల బీర్లను తాగేశారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలతో పోల్చుకుంటే బీర్లు కేసుల విక్రయాలు తగ్గినప్పటికీ ఈ ఏడాది మద్యం ధర పెరగడంతో ప్రభుత్వానికి ఆదాయం గత ఏడాది కంటే అధికంగా వచ్చింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో 4,16,908లు కేసుల బీర్లను మద్యం బాబులు తాగారు. వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లోని 144 వైన్‌షాపులు, 44 బార్లు, 3 క్లబ్‌లతో మద్యం సరఫరా చేస్తుంటారు. మద్యం డిపోలో గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో అధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. మార్చి నెలలో 1,82,747 కేసుల బీర్లను రెండు జిల్లాల్లో విక్రయించారు. మొత్తం రూ.19.77కోట్ల మద్యం అమ్మకాలు మార్చి నెలలో జరిగాయి. అదేవిధంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 2,34,161 కేసుల మద్యాన్ని ఉమ్మడి జిల్లాల్లో విక్రయించారు. మొత్తం ఏప్రిల్ నెలలో రూ.25,30కోట్ల నగదు బీర్ల విక్రయంతో లభించింది.ఈ ఏడాది మార్చి నెల22వ తేదీన అత్యల్పంగా 1250 కేసులు, మార్చి15వ తేదీన అత్యధికంగా 13148 కేసులు విక్రయించారు. అదేవిధంగా ఏప్రిల్‌లో1వ తేదీన అత్యల్పంగా 2127 కేసులు, అత్యధికంగా 15వ తేదీన 18987 కేసులను విక్రయించారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 40,24,428 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 4,16,908 కేసులు విక్రయించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆ రెండు నెలల కాల వ్యవధిలో 7520 కేసుల బీర్ల విక్రయాలు తగ్గాయి. అయినప్పటికీ ఈ ఏడాది బీరు ధరలు పెరగడంతో ఆదాయం మాత్రం రూ.1.25కోట్లు పెరిగింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రూ.43.82కోట్లు బీర్ల విక్రయాల ద్వారా ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.45.07కోట్ల బీర్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో వేసవి తాపం నుంచి సేదతీరేందుకు మందుబాబులు అధిక సంఖ్యలో బీర్లు సేవిస్తున్నారు. దీంతో రెండు జిల్లాల్లోని వైన్‌షాపులు, బార్లు, క్లబ్‌లలో బ్రాండెండ్ బీర్లు లభించడం కష్టంగా మారింది. 

Related Posts