YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నీట్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాలి: రాహుల్‌ గాంధీ డిమాండ్‌

నీట్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాలి: రాహుల్‌ గాంధీ డిమాండ్‌

నీట్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాలి: రాహుల్‌ గాంధీ డిమాండ్‌
న్యూఢిల్లీ సెప్టెంబర్ 7
దేశ‌వ్యాప్తంగా వచ్చే ఆదివారం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన నీట్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని కాంగ్రెస్‌ అగ్ర నాయ‌కుడు రాహుల్‌ గాంధీ కేంద్ర‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఒత్తిడిని పట్టించుకోకుండా ప్రభుత్వం గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయ‌న‌ విమర్శించారు. ప్ర‌భుత్వం అనాలోచితంగా చేస్తున్న గుడ్డి నిర్ణ‌యాల‌తో విద్యార్థులు ఫెయిర్‌గా ప‌రీక్ష రాసే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని, వారు ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.ఈ నెల 12న (ఆదివారం) నిర్వ‌హించత‌ల‌పెట్టిన నీట్‌ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమ‌వారం విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం పిటిష‌న‌ర్‌ల అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చిన సంగ‌తి తెలిసిందే. అదేరోజు 12వ తరగతి ఇంప్రూవ్‌మెంట్‌/కంపార్‌్ుమెంట్‌ పరీక్షలు ఉన్నందున నీట్‌ను వాయిదావేయాలని పలువురు కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. నీట్‌ జాతీయ స్థాయి పరీక్ష కావడంతో దాంట్లో జోక్యం చేసుకోవడం సబబు కాదని, ఒక్కశాతం మంది కోసం మొత్తం వ్యవస్థను ఆపలేమని కోర్టు అభిప్రాయపడింది.ఈ పరిణామాల నేప‌థ్యంలో ఇవాళ ట్విట్ట‌ర్‌ వేదికగా రాహుల్‌ గాంధీ స్పందించారు. నీట్ ప‌రీక్ష నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైన‌ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో విద్యార్థులపై ప‌డుతున్న‌ ఒత్తిడిని ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, నీట్‌ను వాయిదా వేయాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థుల‌కు న్యాయమైన అవకాశం కల్పించాల‌ని ట్వీట్‌ చేశారు.

Related Posts