YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం: హోం శాఖ మంత్రి సుచరిత

మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం: హోం శాఖ మంత్రి సుచరిత

మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం: హోం శాఖ మంత్రి సుచరిత
గుంటూరు సెప్టెంబర్ 7
మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం తీసుకొచ్చినట్లు హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసనసభ, మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాం.. కేంద్రం ఆమోదించగానే వెంటనే అమలు చేస్తామని పేర్కొన్నారు. దిశ యాప్‌తో ఇప్పటికే చాలామంది మహిళలను రక్షించినట్లు చెప్పారు.దిశ చట్టాన్ని కేంద్రం ఇంకా ఆమోదించలేదనే విషయం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ తెలుసని తెలిపారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దిశ చట్టం కింద కొన్ని ప్రత్యేకమైన నేరాలు వస్తాయని ముందుగా లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం హయాంలో మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

Related Posts