YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సిరివెళ్ల మండల కేంద్రాన్ని సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్

సిరివెళ్ల మండల కేంద్రాన్ని సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్

సిరివెళ్ల మండల కేంద్రాన్ని సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్
నంద్యాల
 సిరివెళ్ల మండల కేంద్రాన్ని సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. మంగళవారం సిరివెళ్ల మండల కేంద్రాన్ని ప్రధాన రహదారులను అంతర్గత రహదారుల ను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మరియు  సిరివెళ్ల తహసీల్దార్  మాధవ  . సిరివెళ్ల ఎంపీడీవో సాల్మన్ రాజు .ఆర్ డబ్యు ఏఇ మధుసూధన్ రెడ్డి లతో కలిసి గ్రామ పారిశుధ్య పనులను పరిశీలించారు.
నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ గ్రామములోని సచివాలయ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది  గ్రామ పరిశుభ్రత పై   అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగు నకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు వస్తున్నాయని  కాలువలలో. కుంటలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని  తద్వారా  డెంగ్యూ  వ్యాధి వచ్చే అవకాశం ఉందని  అలా రాకుండా ఉండుట కొరకు గ్రామములో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొద్దీ రోజుల క్రితమే డెంగ్యూ వలన మరణాలు కూడా సంభవించాయి అని అన్నారు. ఇలా జరగకుండా  ఉండాలంటే ప్రజలు కూడ వారి వారి గృహాలను .గృహాలపరిసర ప్రాంతాలలో శుభ్రత పాటించాలని కోరారు. మరియు గ్రామపంచాయతీ లోని పారిశుద్ధ్య కార్మికులు వాటర్ ట్యాంక్ లను శుద్ధి చేయాలన్నారు .  హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని  పిచికారీ చేస్తుండాలిని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరైనా విధులయందు అలసత్వం వస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు..
ఈ కార్యక్రమంలో సిరివెళ్ల తహసీల్దార్  మాధవ  . సిరివెళ్ల ఎంపీడీవో సాల్మన్ రాజు .ఏఇ .మధుసూధన్ రెడ్డి స్థానిక గ్రామపెద్దలు  గ్రామ పంచాయతీ కార్యాలయం సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts