YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ

ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ

నంద్యాల
నంద్యాల పార్లమెంటులోని పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం మండలంలో తాహశీల్దారు కి బుధవారం నాడు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూవ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తూ తాలుకా ఆఫీస్ దగ్గర ధర్నా చేసి నిరసన తెలిపారు. తదనంతరం వినతి పత్రం తాహశీల్దారు కి ఇచ్చారు. .
ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల గంగాధర్ ,మండల బాధ్యుడు శంకరయ్య , జిల్లా సెక్రటరి చిట్టిబోయిన శ్రీనివాసులు ,జిల్లా ఓబిసి కార్యదర్శి మద్దిలేటి యాదవ్ , యువనాయకుడు బైరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి  మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts