హిందువుల మనోభావాలను గౌరవించి, తమ నిర్ణయమును పునస్సమీక్షించి, వినాయకచవితి పర్వదిన సాంప్రదాయ వేడుకలకు అనుమతి మంజూరు చేయవలసిందిగా కోరుతూ బుధవారం దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఒక వినతి పత్రమును దర్శి మండల డిప్యూటీ తహసీల్దార్ కి సమర్పించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే విజయ గణేష్ స్వామి వారి వేడుకలు చేసుకోవచ్చునని, హిందువులకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు శ్రీ వినాయకచవితి పండుగ చాలా విశిష్టమైనది కనుక వేడుకలకు అనుమతి ఇచ్చి హిందువుల మనోభావాలను గౌరవించవలసిందిగా ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమములో జనసైనికులు సర్వశ్రీ పసుపులేటి చిరంజీవి, పుప్పాల పాపారావు, మాదా వెంకట శేషయ్య, చాతరాసి కొండలు, షేక్ ఇర్షాద్, జడల వెంకట్, పుప్పాల రుద్ర, ఉప్పు ఆంజనేయులు, తోట వెంకీ, పార్సెపు హనుమంతరావు, ఈర్ల కొండలు, అబ్దు అఖిల్, చలువాది శివ, పసుపులేటి సాయి, సానే గుర్నాథం, మరెడ్డి పవన్ , ఆవుల కొండలు, అంచుల వీరాంజనేయులు, పి. నాగేశ్వర రావు, బి. పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై వివాదం నడుస్తూనే ఉంది.వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ విశాఖలో మౌనదీక్ష చేపట్టారు.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశ్వ హిందూ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మౌన దీక్షకు కూర్చుకున్నారు.. వినాయకుడి విగ్రహానికి నల్ల రిబ్బన్ కట్టి.. విశ్వ హిందూ సాదు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసనంద సరస్వతి దీక్షకు కూర్చునున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసనంద సరస్వతి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిపై వినాయకుడు సైతం మౌన దీక్ష చేస్తున్నారన్నారు.. హిందువుల తొలి పండుగకు ప్రభుత్వం కరోనా పేరుతో అడ్డంకులు సృష్టిస్తోందన్న ఆయన.. పాశ్చత్య దేశాల్లో సైతం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. కానీ, రాష్ట్రంలో క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇది ఖచ్చితంగా వివక్ష.. హిందూ ధర్మం, సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.. అందరూ కలిసి వినాయక ఉత్సవాలు చేసుకోండి.. ఎవ్వరు అడ్డువచ్చినా నిర్వహించండి అని పిలుపునిచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి హిందువు గణేష్ ఉత్సవాలు జరపాలని.. ఎన్ని కేసులు పెట్టిన భయపడొద్దని సూచించారు శ్రీనివాసనంద సరస్వతి.