YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో పతాక స్థాయికి ప్రచారం

కర్ణాటకలో పతాక స్థాయికి ప్రచారం

రెండు పార్టీలూ కర్ణాటక ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ఈరెండు రోజుల ప్రచారాన్ని బట్టి అర్థమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ వివిధ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కర్ణాటకలో బీజేపీ గెలిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వరుస సభలతో మోడీ కన్నడనాట హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య మీద కూడా ఆయన సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు అమిత్ షా కూడా రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇక కొద్దిరోజులే గడువు ఉండటంతో షా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన టార్గెట్ అంతా సిద్ధరాయ్యయే. లింగాయత్ లకు మైనారిటీ హోదా కల్పిస్తూ సిద్ధరాయమ్య తీసుకున్న నిర్ణయం ఎలక్షన్స్ స్టంట్స్ గా షా అభివర్ణించారు. గతంలోనే లింగాయత్ లను మైనారిటీలుగా గుర్తిస్తూ పంపిన ప్రతిపాదనను యూపీఏ ప్రభుత్వం తిరస్కరించిన విషయాన్ని షా గుర్తు చేస్తున్నారు. అమిత్ షా రోడ్ షోలకు భారీగా కన్నడ నాట స్పందన వస్తోంది.ఖర్గేను ముఖ్యమంత్రిగా చేయకుండా కాంగ్రెస్ పార్టీ దళితులను అడ్డుకుంటోందని మోడీ తీవ్ర విమర్శలే చేశారు. యడ్యూరప్ప నాయకత్వంలో కర్ణాటక పూర్థి స్థాయిలో అభివృద్ధి చెందుతుందున్న నమ్మకం తనకుందన్నారు. ఇలా మోడీ తన సభల్లో వాడి వేడి ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. రాహుల్ గాంధీ కూడా కర్ణాటకలో సుడిగాలి పర్యటన చేశారు. మోడీ పార్టీకి ఓటేస్తే అది వృధా చేసినట్లేనన్నారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) ప్రజలను మోడీ సర్కార్ దోచుకుంటుందన్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి నీరవ్ మోడీ లాంటి వాళ్లు విదేశాలకు వెళుతున్నా పట్టించుకోవడం లేదని, పేదలను మాత్రం జలగల్లా పీడిస్తున్నారని రాహుల్ మోడీపై విరుచుకుపడ్డారు. అలాగే సిద్ధరామయ్య కూడా తన వ్యంగ్యాస్త్రాలతో బీజేపీని తూర్పారపడుతున్నారు. తాను హిందువునని, అమిత్ షా హిందువు కాదని, జైనుడని సిద్ధరామయ్య ప్రతి చోటా ప్రచారం చేస్తున్నారు. హిందువుల ఓట్లపై ప్రభావం చూపేలా సిద్దరామయ్య వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ కూడా కన్నడరాష్ట్రంలో పర్యటించడం విశేషం. యోగి ఆదిత్యానాధ్ హిందూ ఓట్లు బలంగా ఉన్న చిక్క మగలూరు, శివమొగ్గ, ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పులవల్లనే యాసిన్ భత్కల్, ఒవైసీ వంటి వారు పుట్టారని యోగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి ప్రియశిష్యుడు ఆంజనేయుడి జన్మస్థలమైన కర్ణాటకను సిద్ధరామయ్య అపవిత్రం చేశారని విమర్శించారు. ఇలా కర్ణాటకలో రాజకీయ ప్రచారం వేడెక్కింది. వ్యక్తిగత దూషణలు, విమర్శలు నేతల ప్రసంగాల్లో హైలెట్ గా నిలుస్తున్నాయి.

Related Posts