YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాడు-నేడు’తో ప్రభుత్వ బడుల రూపురేఖల్లో మార్పు  ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన ఎమ్మెల్సీ బల్లి

నాడు-నేడు’తో ప్రభుత్వ బడుల రూపురేఖల్లో మార్పు  ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన ఎమ్మెల్సీ బల్లి

నాడు-నేడు’తో ప్రభుత్వ బడుల రూపురేఖల్లో మార్పు
 ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన ఎమ్మెల్సీ బల్లి
నెల్లూరు
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘నాడు-నేడు’ కింద రూ.12 వేల కోట్లతో రాష్ట్రంలోని 15 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చారని రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. బుధవారం చిట్టమూరు మండలం లోని మెట్టు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత,ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మెట్టు గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’ మొదటి దశలో చేపట్టిన అభివృద్ధి పనులను  పరిశీలించారు.
పాఠశాలలో రూ.40 లక్షల తో పూర్తి చేసిన పనులు పరిశీలించారు. జగనన్న విద్యాకానుక గురుంచి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ప్రభుత్వ బడుల్లో కనీస వసతులు ఉండేవి కావన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి ,రెండో,మూడో విడతల్లో 12 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 15 వేల  ప్రభుత్వ బడులు నాడు- నేడు ద్వారా అద్భుతమైన మార్పులు చోటు చేసుకొని దేశ చరిత్రలోనే ఆంద్రప్రదేశ్ గుర్తింపు పొందిందనీ వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలో నాడు-నేడు మొదటి దశలో రూ.227 కోట్లతో 1062 బడుల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. ఎస్‌ఎంసీల ఆధ్వర్యంలో పనులు చేయించడం వల్ల 30 శాతం ఖర్చులు తగ్గాయని వివరించారు.
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు  సీఎం జగన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. రోజూ ఒకే రకంగా కాకుండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు మెనూలో మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఈ పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నామకరణం చేసి పిల్లలకు నాణ్యమైన భోజనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.మధ్యాహ్నం భోజన పథకం ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు  సీఎం జగన్  పెంచారు అనీ,దీంతో ప్రభుత్వానికి రూ. 344 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు. అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను తీసుకొస్తున్నట్లు  తెలిపారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించడం జరిగింది అని తెలిపారు.
వారితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారి నాణ్యతను పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రోజువారీ నివేదికను అందజేసేలా చర్యలు చేపడతామన్నారు. వీరందరిపై ఆర్డీవో స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు.
అనంతరం పాఠశాలల్లో  ఆర్ ఓ ప్లాంట్లు ను పరిశీలించారు, ఇంగ్లీషు ల్యాబ్ ను పరిశీలించి మధ్యాహ్నం జగనన్న గోరుముద్ద భోజనం పిల్లలుతో కలిసి రచ్చ బండలు మిందా కుర్చీని తిన్నారు , అనంతరం తరగతులు గదిలోకి చేరుకొని జగనన్న విద్యా కానుక క్రింద ఇచ్చిన పుస్తకాలు, డిక్షనరి, బ్యాగులు పరిశీలించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ బల్లి ఉపాధ్యాయులు గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పి పలు ప్రశ్నలు సంధించారు. అదేవిధంగాప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అడిగి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శ్రీహరి రెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, వేమారెడ్డి షనిల్ రెడ్డి, పడియాల శ్రీహరి ,పి. ఉదయ్ భాస్కర్,జానా సాయిశ్రీ హర్ష, షేక్ అబ్దుల్లా, గారహరి,యోగి,వెంకటరెడ్డి,సునీల్,డేన్నీ మరియు విద్యార్థి విభాగం నాయకులు,వైసీపీ నేతలు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కోట ఎస్సై పుల్లారావు,వాకాడు,చిట్టమూరు ఎస్సై, తహశీల్దార్ మునిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Posts