YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది బండ్ల గణేష్

జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది బండ్ల గణేష్

జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది
బండ్ల గణేష్
పవన్ కళ్యాణ్ అభిమానుల జాబితాలో మొదట వినిపించే పేరు బండ్ల గణేష్.
అయితే తాను అభిమానిని కాదు అని భక్తుడినని బండ్ల గణేష్ ఎప్పుడు చెప్తుంటాడు.
కానీ ప్రజల కోసం ఓ పార్టీని స్థాపించి గత ఎన్నికలో పవన్ పోటీ చేయగా బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే అది కోసుకుంటా ఇది కోసుకుంటా అంటూ మాట్లాడి తీరా ఎన్నికలో ఓడిన తర్వాత పార్టీనుండి తప్పుకున్నాడు.ఇక తాను ఏ పార్టీలో లేను అని ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్ తాజాగా ఓ ట్విట్ చేసాడు.అందులో 'తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది' అని పేర్కొన్నాడు.దాంతో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని పవన్ స్థాపించిన జనసేనలో చేరబోయతున్నాడు అని ప్రచారం జరుగుతుంది.బండ్ల జనసేనలో చేరబోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తుండటంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.

Related Posts