YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బీరు బాటిళ్లతో యువకుడిపై దాడి

బీరు బాటిళ్లతో యువకుడిపై దాడి

హైదరాబాద్
ఎల్బీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. బీర్ బాటిల్స్ తో దేవేందర్ అనే యువకుడిపై పదమూడు మంది  తాగుబోతులు మద్యం మత్తులో దాడి చేయగా దేవేందర్ కి తీవ్ర గాయాలయ్యాయి బీ ఘటన బుధవారం ఆర్ధరాత్రి ఎల్బీనగర్ లోని శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ లో చోటుచేసుకుంది. జన్మదిన వేడుకల పేరుతో వైన్ షాప్ లో  అశోక్, అంజి, సాయి మరికొంత మంది స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా మద్యం మత్తులో అశోక్ అనే  బీరు సీసాలు పగలగొట్టిగా పక్క టేబుల్ పై ఉన్న దేవేందర్ అనే యువకుడిపై బీరు సీసా ముక్కలు పడటంతో ఇలా ఎందుకు చేస్తున్నారని సీసా ముక్కలు పడ్డాయని అడగడంతో దేవేందర్ పై అదే బీర్ సీసాలతో  అశోక్ అతని స్నేహితులు దాడి చేశారని,దేవేందర్ ను కడుపులో బీరు సీసాలతో పొడవడంతో తీవ్ర గాయాలవగా బాధితుడు దేవేందర్ ని కామినేని ఆసుపత్రిలో చేర్పిచారు స్థానికులు దేవేందర్ పరిస్తితి విషమంగా ఉండగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు,ఈ ఘటనలో 13 మంది నిందితులలో 6 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా మిగతా 7 మంది పరారీలో ఉన్నారు,దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదవగా దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Related Posts