YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి అలా... సీఎస్ ఇలా కరోనా ఉన్నట్టా..లేనట్టా...

మంత్రి అలా... సీఎస్ ఇలా కరోనా ఉన్నట్టా..లేనట్టా...

హైద్రాబాద్, సెప్టెంబర్ 9, 
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేశాం. ప్రస్తుతం వంద‌ల్లో మాత్రమే కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌లో తెలంగాణ ముందు వ‌రుస‌లో ఉంది. బిజినెస్ కూడా పుంజుకుంది. -సెయింట్ ధెరిస్సా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో కరోనా ఉంది. ఇంకా అదుపులోకి రాలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను వాయిదా వేయండి. లేకుంటే మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంది.
-కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ సోమేష్ కుమార్ లేఖ
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని మంత్రి.. లేదని సీఎస్ ఇద్దరులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకు తెలంగాణలో కరోనా ఉందా? లేదా? అనేదానిపై ప్రజల్లో మీమాంస నెలకొంది. కరోనా కంట్రోల్ అయితే పాఠశాలల్లో, ప్రజలకు కరోనా ఎలా సోకుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటం, దవాఖానాల వద్ద కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ కోసం వందల సంఖ్యలో బారులుదీరుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.దేశంలోనే కొవిడ్ కట్టడిలో తెలంగాణ ముందంజలో ఉందని, పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. వ్యాక్సినేషన్లో సైతం ముందువరుసలో ఉన్నామని, ప్రస్తుతం వందల్లోనే కేసులు నమోదు అవుతున్నాయని వ్యాపారం సైతం ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సీఎస్ సోమేష్ కుమార్ మాత్రం తెలంగాణలో కొవిడ్ తీవ్రత తగ్గలేదని, హుజూరాబాద్ ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహిస్తే కొవిడ్ తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.కొవిడ్ విషయంపై రాష్ర్ట హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. కొవిడ్ నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు.. పాఠశాలలు ప్రారంభిస్తే విద్యార్థులకు కరోనా సోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించడంతో వారం రోజులు గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభించడాన్ని వాయిదా వేశారు. అయితే వ్యాక్సినేషన్ నూరుశాతం పూర్తికాకపోవడం, కొవిడ్ కేసులు కూడా నమోదు అవుతుండటంతో కేటీఆర్, సీఎస్ లు చేసిన ప్రకటనలు చర్చనీయాశంగా మారాయి. కొవిడ్ గురించి వారికే తెలియాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts