హైదరాబాద్
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబరాబాద్ కమీషనర్ రేట్ కు కూతవేటు దూరంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ లో దుండగులు చోరీకి యత్నించారు. కిటికీ గ్రిల్ తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాల కేబుల్ కట్ చేసి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచేందుకు విఫలయత్నం చేసారు. అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో చేసేది లేక బ్యాంక్ లో ఉన్న కంప్యూటర్లు,హార్డ్ డిస్కులు,ఇతర సామగ్రిని ధ్వంసం చేసారు. గురువారం ఉదయం బ్యాంక్ తెరిచిన సిబ్బంది విషయం గమనించి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం లను,డాగ్ స్క్వార్డ్ ను రంగంలోకి దించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ పురుషుడు,ఓ మహిళ ఈ చోరీకి యత్నించి ఉంటారని మరి కొందరు సైతం వీరికి సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు....