YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకేశ్ పర్యటనకు అనుమతినివ్వకపోవడం దారుణం

లోకేశ్ పర్యటనకు అనుమతినివ్వకపోవడం దారుణం

గుంటూరు
నారా లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం విచారకరమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మా జీ మంత్రి, నక్కా ఆనందబాబు అన్నా రు.గుంటూరు జిల్లాలోని నరసరావు పేట నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యట నకు పోలీసులు అనుమతించ కపోవ డం విచారకరమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.అనూష కుటుంబాన్ని పరామర్శించడం కోసం కొద్ది రోజుల క్రితమే నిర్ధారించుకున్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పా? అని ప్రశ్నిం చారు.టీడీపీ నాయకుల కార్యక్రమా లంటే వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతోం దని, ప్రతిపక్ష నాయకులుగా బాధితు లను పరామర్శించడం మా బాధ్యత అని అన్నారు.14 సంవత్సరాలపాటు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు వద్ద పనిచేసిన నాయకులకు విలు వివ్వాల్సివుందని, ప్రజాస్వామ్య యుతంగా చేసే ఆందోళనలను అడ్డు కోవడంలో అర్థంలేదని,ఇలా వ్యవహ రిస్తే వైసీపీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదని అన్నారు.

లోకేష్ పర్యటనకు అనుమతినివ్వాలి అధికారులు కోర్టులముందు దోషులుగా నిలబడతారు

మానవ హక్కులు, చట్టాల్ని ఉల్లంఘించే అధికారులు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారు.  వేలాది మందితో సజ్జల సభకు వర్తించని కోవిడ్ నిబంధనలు లోకేష్   పర్యటనకు వర్తిస్తాయాని  టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు  ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో రెండేళ్లలోనే మహిళలపై సుమారు 500 వరకు అత్యాచారాలు, అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే నిందితుడైన వెంకట్ రెడ్డిని మూడు నెలలు దాటినా ఇంతవరకు ఎందుకు పట్టుకోలేక పోయారు? ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులైతే పట్టుకోరా? వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా హింసిస్తూ రాసలీలల్లో మునిగి తేలుతు అంబోతుల్లా వ్యవహరిస్తున్నారు. వీరిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? అధికార పార్టీ నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. ఇక రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాలకు ఎలా అడ్డుకట్ట పడుతుంది? గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మైనార్టీ దంపతులు ఆటోలో వెళ్తుండగా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే పట్టించుకోలేదు. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? సత్తెనపల్లి నియోజకవర్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భర్తను బెదిరించి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే.. ఇది తమ పరిధిలోనిది కాదంటూ సత్తెనపల్లి పోలీసులు తప్పించుకున్నారు. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? నిర్భయ చట్టం కింద కేంద్రం రాష్ట్రానికి రూ.139 కోట్లు విడుదల చేస్తే కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టడం జగన్మోహన్ రెడ్డి చేతగానితనం కాదా? దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? దిశ చట్టం కింద ముగ్గురికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాశిక్ష వేశామని చెప్పిన హోంమంత్రి, డీజీపీ .. వారి వివరాలు బహిర్గతం చేయాలి. లేనిపక్షంలో ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అయన డిమాండ్ చేసారు.జ
 కట్టుకున్న భార్యను హింసించిన అధికారికి జగన్ రెడ్డి ఉన్నత పదవులు ఇచ్చి సత్కరిస్తే.. మహిళపై నేరాలు ఎలా తగ్గుతాయి? రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య యుతంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు బాధితులకు అండగా నిలుస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గం. కడప జిల్లా ప్రొద్దుటూరులో  సజ్జల రామకృష్ణారెడ్డి వేలాది మందితో నిర్వహించిన సమావేశానికి అడ్డురాని కరోనా నిబంధనలు లోకేష్ గారికే అడ్డువస్తాయా? మీ అరాచకాలతో మానవ హక్కులు, చట్టాల్ని ఉల్లంఘిస్తే భవిష్యత్ లో అధికారులు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించాలి. గతంలో వైఎస్, జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు అండగా నిలిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్న నారా లోకేష్  పర్యటనకు అనుమతి ఇవ్వాలని అయన అన్నారు.

ఉద్రిక్తతంగా లోకేష్ పర్యటన

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేష్ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. అక్కడి నుంచి లోకేష్ను పోలీసులు ఎక్కడకు తరలిస్తారనే ఉత్కంఠ నెలకొంది.మరోవైపు నారా లోకేష్ వస్తున్న నేపథ్యంలో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని… అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. మరోవైపు టీడీపీ కీలక నేతలందరినీ పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

Related Posts