విఘ్నాలు తొలగాలి... కార్యాలు నిర్విఘ్నంగా సాగాలి విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుని అనుగ్రహం మన అందరిపై ఉండాలి
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు మంత్రి హరీష్ రావు
వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ కార్యం చేయాలి అన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే అని, అన్ని విఘ్నలు తొలగి అన్ని కార్యాలు సిద్దించాలని ఆ గణనాథుణ్ణి ఆయన ప్రార్ధించారు.. కరోనా మహమ్మారి అనే విఘ్నం తోలగాలని కోరుకున్నారు.. ఆ విఘ్నేశ్వరుని దీవెనతో మనం చేసే కార్యాలు నిర్విఘ్నంగా సాగాలి. అందరం ఇంట్లోనే మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించుకోని ఇంటిల్లిపాది వేడుకగా పూజించాలన్నారు... ప్రకృతి ని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ అని, మట్టి గణపతినే పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.. ప్రకృతి సిద్దమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజిద్దాం. ప్లాస్టిక్ పూలు, దండలు వద్దు, నిమజ్జనం సమయంలో చెరువులలో, వాగులను ప్లాస్టిక్ రహితం ఉంచుకొని పర్యావరాన్ని సంరక్షించు కుందామన్నారు.. మన అందరి పై విగ్నేశ్వరుని అనుగ్రహము ఉండాలని కోరుకున్నారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.