YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పవన్ హాట్ కామెంట్స్

 పవన్ హాట్ కామెంట్స్

 పవన్ హాట్ కామెంట్స్
విజయవాడ, సెప్టెంబర్ 9
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, కడప జిల్లాలోనే రోడ్ల పరిస్థతి దారుణంగా మారిందని గత కొన్ని రోజులుగా తన వాదన వినిపిస్తూ వస్తోన్న పవన్‌ కళ్యాణ్‌ తాజాగా మరోసారి ట్విట్టర్‌ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ‘అమ్మపెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అంటూ వైసీపీ తనదైన శైలీలో ధ్వజమెత్తారు.హైదరాబాద్ హైదర్షాకోట్ దగ్గర ఉండే కాట్నం బాలగంగాధర్‌ తిలక్‌ ప్రమాదాల నివారణ కోసం రోడ్లను బాగు చేసే పని స్వచ్ఛందంగా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈయన దేశంలోని చాలా చోట్ల తన సొంత డబ్బుతో ఇప్పటి వరకు 2100 గుంతలను పూడ్చాడు. అందుకే ఈయనను రోడ్‌ డాక్టర్‌గా పిలుచుకుంటారు. అయితే బాలగంగాధర్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోనూ రహదారి గుంతలను పూడ్చేందుకు వెళ్లాడు. ఈ సమయంలోనే అక్కడి పోలీసులు తనపై కేసులు పెడతామంటూ వేధిస్తున్నారని ఆయన తాజాగా ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని ప్రస్తావించిన పవన్‌.. ‘వైసీపీ ప్రభుత్వం రోడ్లను బాగు చేయడం లేదు.. అలాగే సొంతంగా రోడ్లను బాగు చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తిని వేధిస్తున్నారని’ అర్థం వచ్చేలా.. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

Related Posts