YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మోడీ, జగన్..మధ్యలో చంద్రబాబు

మోడీ, జగన్..మధ్యలో చంద్రబాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 11, 
చంద్రబాబుని అందుకే రాజకీయ చాణక్యుడు అనాలి. ఆయన ఏపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడుపుతున్నారు. ఆయన ఎవరినీ వదులుకోరు. అలాఅని ఎవరికీ దూరం చేసుకోరు. ఆ మాటకు వస్తే ఆయన ఏపీలో పొత్తు పెట్టుకోనిదీ ఒక్క వైసీపీతో మాత్రమే. ఎందుకంటే అదే టీడీపీకి అసలైన ప్రత్యర్ధి కాబట్టి. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలు అస్పష్టంగా గందరగోళంగా మారడానికి చంద్రబాబే కారణమని జాతీయ స్థాయిలో కూడా చర్చ సాగుతోంది. ఏపీలో చూసుకుంటే జగన్ తీరు కచ్చితంగా ఎవరైనా చెప్పగలరు. ఆయన జాతీయ స్థాయిలో ఎవరితో కలుస్తారు, ఎవరితో కలవరు అన్నది కూడా చెప్పేయవచ్చు. కానీ చంద్రబాబు విషయంలో అది ఎవరూ చెప్పలేరు.ఏపీలో బీజేపీ విషయం తీసుకుంటే జగన్ వైపే మొగ్గు చూపుతోంది. జగన్ తో కలసి ముందుకు సాగాలని కేంద్రంలోని మోడీ,అమిత్ షాల కచ్చితమైన ఆలోచనగా చెబుతున్నారు. అదే చంద్రబాబుతో కలిస్తే ఆయన ఎక్కడ ముంచుతాడో అన్న డౌట్లు వారిద్దరికీ ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఏపీలో జగన్ తో బీజేపీని కలవనీయకుండా ఎన్ని చేయాలో అన్నీ తెర వెనక చంద్రబాబు చేస్తున్నారు అంటున్నారు. ఆయన బీజేపీలోకి పంపించిన ఎంపీలు కూడా ఈ విషయంలో తెగ బిజీగా ఉన్నారు. అంతే కాదు బీజేపీ పెద్దలు కోరక‌పోయినా ఆఫర్లు డిస్కౌంట్లూ ఇస్తూ చంద్రబాబు వారిని ఆకట్టుకోవాలని చూస్తున్నారుట.ఇక చంద్రబాబు బీజేపీతో కలసి వెళ్తామని ఒక వైపు చెబుతున్నా జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలోనూ ఆయన మిత్రులు ఉన్నారు. వారితో కూడా ఆయన సన్నిహితంగానే ఉంటున్నారని అంటున్నారు. అంటే బాబు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు అన్న మాట. ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వారితో సఖ్యతగా లేకుంటే ఇబ్బంది అన్న ముందు చూపుతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారు అనుకోవాలి. అంతే తప్ప నిజంగా బీజేపీతో కలసి 2024 ఎన్నికలకు వెళ్తామని బాబు డేరింగ్ గా చెప్పలేరు. దానికి కారణం కేంద్రంలో మోడీకి తగ్గుతున్న క్రేజ్. ఇక విపక్షాలు కనుక పుంజుకుంటే చాలా సులువుగా ఆయన అవతల వైపు వెళ్ళిపోగలరు. అయితే ఆయన ఎక్కడా బయటపడరు. ఆయన కనుక ఏపీలో కాంగ్రెస్ తో జట్టు కడితే బీజేపీ పని సులువు అవుతుంది. కానీ ఆయన మాత్రం నేనున్నాను అంటూ కవ్విస్తున్నారు. దీంతోనే గందరగోళంగా రాజకీయం మారుతోంది.ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ జగన్ కలిస్తే మాత్రం ఏపీలో మరో మారు అధికారం దక్కదు అన్న భయాలు ఏవో చంద్రబాబుకు ఉన్నాయి. అలాగని మోడీ ది గ్రేట్ అంటూ ఆయన్ని భుజానికి ఎత్తుకునేంత సాహసం ఆయన చేయలేకపోతున్నారు. అందువల్లనే ఆయన బీజేపీని దువ్వుతూ జగన్ కి దూరం చేసే పనిలో బిజీగా ఉన్నారు. చంద్రబాబు స్ట్రాటజీ చూస్తూంటే ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుని కూడా ఆనక జెండా మార్చేసి విపక్ష కూటమిలోకి వెళ్ళిపోగలరు. అలా ఆయన ఒక్క దెబ్బకు అటు బీజేపీ, ఇటు జగన్ అవకాశాలను చిత్తు చేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుకు ఇంకో వెసులుబాటు కూడా ఉంది. జగన్ ఎట్టి కాంగ్రెస్ కూటమి వైపు చూడరన్నదే ఆయన గట్టి ధీమా. అందువల్ల ఏపీ రాజకీయాలను, పొత్తులను బాబు తనదైన శైలిలో ప్రభావితం చేస్తున్నారు. బాబు తీరుతో అటు బీజేపీ జగన్ మాత్రమే కాదు కాంగ్రెస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది అంటున్నారు.

Related Posts