YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఈనెల 27న భారత్ బంద్

ఈనెల 27న భారత్ బంద్

హైదరాబాద్
ఈనెల 27 న భారత్ బంద్ పాటించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. మోదీ ప్రభుత్వ కార్పోరేట్  విధానాలకు నిరసనగా బంద్ లో పాల్గొనాలని ప్రతిపక్షాలు కోరాయి.  మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 20నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీజేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణలో పలు కార్యక్రమాలుచేపట్టనున్నారు.  ఈనెల 22న ఇందిరా పార్క్ వద్ద మహాదర్నా, 27న భారత్ బంద్, అక్టోబర్ 5న పోడు రైతులకు మద్దతుగా 400కిమీ మేర రాస్తారోకోలు నిర్వహించానున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాడతామని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. పోడు చట్టాలు, రైతులకు  వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని అయన డిమాండ్ చేసారు. కోర్టుల సూచనలను సైతం  ప్రభుత్వాలు పెడ చెవిన పెడుతున్నాయి. కోవిడ్ తో జీవనాధారం కోల్పోయిన వారిని ఆడుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రతిపక్షాలన్నీ పోరాటంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. ప్రజా వ్యతిరేక విధానాలతో మోదీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. దేశంలో తలెత్తిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం విఫలం అయిందని అయన విమర్శించారు.

Related Posts