కాణిపాకం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. ఉదయం ఆలయంలో అర్చకులు, వేదపండితులు ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ముందుగా ధ్వజస్తంభం పై ఉన్న మూషిక పటానికి ప్రత్యేక పూజలు చేసి మూషిక పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేసి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాది దేవతలని ఆహ్వానించారు అనంతరం స్వామివారి పటానికి పంచాబృత అభిషేకాలు నిర్వహించి ధూప ,దీప నైవేద్యాలు సమర్పించారు 21 రోజులపాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నుంచి స్వామివారి కి తొమ్మిదిరోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం 12 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే గ్రామోత్సవాలు రద్దుచేసి కేవలం ప్రాకారోత్సవం మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ఉభయదారులుచే స్వామివారు ప్రతిరోజు ఒక్కో వాహనంపై ఉరేగుతారు. ఈ కార్యక్రమాలలో తక్కువ సంఖ్యలో ఉభయదారుల ను అనుమతిస్తామని ఆలయ ఈఓ వెంకటేష్ తెలిపారు.