హైదరాబాద్
హైదరాబాద్ సైదాబాద్ లో ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న రాజు పోలీసులకు చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజు సొంతూరు అడ్డగూడూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి రాజు దొరికాడని హైదరాబాద్ తరలించామని అడ్డగూడూరు ఎస్సై ఉదయ్ కిరణ్ వెల్లడించారు. గురువారం సాయంత్రం అదృశ్యమైన బాలిక రాజు ఇంట్లో విగతజీవిగా కనిపించింది.