YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రెస్, పోలీసు స్టిక్కర్ల సోదాలు

ప్రెస్, పోలీసు స్టిక్కర్ల సోదాలు

విశాఖపట్నం
మీరు నడిపే వాహనం పైన పోలీస్ స్టిక్కర్ ఉందా..  ప్రెస్ అనే స్టిక్కర్ పెట్టుకొని   ప్రయాణిస్తున్నారా..  నిజంగా మీరు పోలీస్ ఐతే పర్వాలేదు. జర్నలిస్టు అయితే ఇబ్బంది లేదు. మీరు అదే వృత్తి చేయకుండా స్టిక్కర్ పెట్టుకున్నారో తస్మాత్ జాగ్రత్త. విశాఖలో ఇలాంటి నకిలీ స్టిక్కర్ల పై దృష్టి పెట్టింది పోలీసుశాఖ.  పోలీస్ కమిషనర్  ఆదేశాలతో  విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు.  విశాఖపట్నం హనుమంతవాక  మద్దిలపాలెం  జంక్షన్ లో శనివారం ఉదయం  ఏ డి సి పి ఆదినారాయణ,  పర్యవేక్షణలో  ఏసీపీ కుమారస్వామి  సీఐ షణ్ముఖ ల నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. మద్దిలపాలెం లో నిర్వహించిన తనిఖీలలో ఊహకందని నకిలీ స్పీకర్ల  తో వాహనదారులు పట్టుబడ్డారు. అయితే వీరిలో కొంతమంది పోలీసు స్టిక్కర్లు తో దర్శనమిచ్చాయి.  మరి కొంతమంది  కార్ల పైన  ప్రెస్ స్టిక్కర్లు తో చలామణి అయిపోతున్నారు . జిల్లా సరిహద్దులు దాటి ఆర్టీవో బోర్డు పెట్టుకుంటూ కారులో షికారు చేస్తున్న  ఓ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించి ఆర్టీవో బోర్డు తొలగించారు.  అయితే వీరిలో కొంతమంది నిజమైన పోలీసులు జర్నలిస్టులు ఉండడంతో వారిని విడిచిపెట్టారు.  మరికొంత మంది ప్రభుత్వ అధికారులు కార్లకు  బోర్డులు పెట్టుకొని  దర్జాగా తిరిగెస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇలా పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది నకిలీ స్పీకర్లతో ప్రయాణించడం తో   పోలీసు శాఖ మరి కొంతకాలం పాటు  స్పెషల్ డ్రైవర్లు చేయాలని నిర్ణయించుకుంది. ప్రజల్లో చైతన్యం తెచ్చే అంతవరకూ డ్రైవర్ కొనసాగుతాయని పోలీసులు అధికారులు   తెలిపారు. అయితే ఏ డిసిపి ఆదినారాయణ మాట్లాడుతూ ఇప్పటికే చాలా మంది నకిలీ స్పీకర్లతో  తిరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అలాంటి నకిలీలు తప్పించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ అన్నారు.  ఈ డ్రైవ్ లో  నిజమైన ఉద్యోగులకు ఎటువంటి  ఇబ్బంది ఉండదని తెలిపారు. అయితే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు  నాలుగు గంటల పాటు ఈ డ్రైవ్ నిర్వహించామన్నారు ఏడిసిపి ఆదినారాయణ.

Related Posts