ఒంగోలు
గ్రానైట్ లారీ డ్రైవరును బెదిరించడంతో పాటు అతనిపై దాడిచేసి నగదు దోచుకెళ్లిన ఘటనలో కేసులో ముగ్గురు యువకులను ప్రకాశంజిల్లా అద్దంకి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రెండు లక్షల రూపాయల నగదుతో పాటు ఒక ఇన్నోవా కారు, మోటారు సైకిలును స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే గుంటూరుజిల్లాకు చెందిన కుంచాల తిరుపతయ్య, ఉప్పుటూరి రవి, ప్రకాశంజిల్లా మార్టూరుకు చెందిన కరవది హర్ష వర్ధన్ లు ఒక ముఠాగా ఏర్పడి ఒక గ్రానైట్ లారీ డ్రైవర్ ను బెదరించి నగదు దోచుకున్నారు. సదరు డ్రైవర్ గ్రానైట్ పాలిషింగ్ రాళ్లను లారీలో లోడు చేసుకుని మార్టూరు మండలం కొణిదెన గ్రామం నుండి ఉప్పుమాగులూరు మీదుగా వెళ్తున్న సమయంలో కొణిదెన సెంటరు వద్ద నిందితులు బల్లికురవ పోలీసులమని ఎస్సై గారు పంపారని చెప్పి లారీ డ్రైవరును బెదిరించారు. అతని ఫోన్ ద్వారా లారీ ఓనర్ లలిత్ దేవాసికి ఫోన్ చేసి లారీ డ్రైవర్ వద్దనున్న రెండులక్షల రూపాయలను తీసుకుని పారిపోయారు. దాంతో లారీ యజమాని పోలీసులకు పిర్యాదు చేసాడు. వేమవరం జంక్షన్లో అద్దంకి సీఐ రాజేష్, బల్లికురవ ఎస్సై కిషోర్ బాబులు తమ సిబ్బందితో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుండి రెండు లక్షల రూపాయల నగదుతోపాటు వీరు ఈ నేరానికి ఉపయోగించిన ఒక ఇన్నోవా కారు, మోటారు సైకిలును స్వాధీనం చేసుకున్నారు.